Russian woman and Bihar boy: ప్రియుడి కోసం దేశం దాటి వచ్చిన రష్యా యువతి.. గుడిసెలో ఉండేందుకూ రెడీ..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేమకు దేశాలు, సరిహద్దులతో సంబంధం లేదని చెప్పే ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా రష్యాకు చెందిన జూలీ అనే యువతి, బిహార్కు చెందిన తన ప్రియుడి కోసం భారత్కు రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవితాన్ని ప్రారంభించాలనే నిర్ణయంతో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి బిహార్లోని భాగల్పూర్కు చేరుకుంది. ప్రస్తుతం వీరిద్దరి ప్రేమకథ స్థానికంగా చర్చకు దారితీయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది. నవభారత్ మీడియా కథనం ప్రకారం.. బిహార్లోని భాగల్పూర్కు చెందిన రాహుల్ యాదవ్ ఉపాధి కోసం రష్యాకు వెళ్లాడు. అక్కడ అతడికి జూలీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది.
వివరాలు
నవంబర్లో రాహుల్, జూలీల వివాహం
కొంతకాలం తర్వాత రాహుల్ రష్యా నుంచి తన స్వదేశమైన భారత్కు తిరిగి వచ్చాడు.
అయినప్పటికీ ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. దూరంగా ఉన్నప్పటికీ తమ బంధాన్ని కొనసాగించిన రాహుల్, జూలీ చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో జూలీ తన తల్లిదండ్రులతో కలిసి భాగల్పూర్లోని రాహుల్ ఇంటికి వచ్చింది.
విదేశానికి చెందిన యువతి తమ గ్రామానికి రావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరోవైపు, రాహుల్ కుటుంబ సభ్యులు జూలీ బంధువులతో మాట్లాడి వివాహం గురించి చర్చించారు.
ఈ చర్చల అనంతరం ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకారం తెలిపినట్లు సమాచారం.
ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారం, రాహుల్, జూలీల వివాహం నవంబర్లో జరగనుంది.
వివరాలు
జూలీ నిర్ణయంపై నెటిజన్ల స్పందన
పెళ్లి తర్వాత ఎక్కడ నివసించాలనే విషయంపై కూడా ఈ జంట చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
తమ కుటుంబం చిన్న గుడిసెలో నివసిస్తోందని రాహుల్ జూలీకి వివరించాడట.
అయినప్పటికీ అతడితో కలిసి అదే గుడిసెలో జీవించేందుకు జూలీ అంగీకరించినట్లు సమాచారం.
దీంతో వీరిద్దరి ప్రేమకథ మరింతగా చర్చలోకి వచ్చింది. ప్రేమించిన వ్యక్తితో జీవించేందుకు దేశాన్ని దాటి వచ్చిన జూలీ నిర్ణయంపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
రాహుల్, జూలీ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన జూలీ
A Russian girl followed her love to India after Rahul Yadav from Bihar returned home from Russia.
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 13, 2026
Despite learning that he was in hiding, she insisted on staying with him, and their families have reportedly agreed to get them married in November. ❤️ pic.twitter.com/bcCOl3QJi8