LOADING...
BillBoard: వాహ్ తాజ్‌మహల్ టీ కాదు.. తబలాలో ను ప్రత్యేకత
BillBoard: వాహ్ తాజ్‌మహల్ టీ కాదు.. తబలాలో ను ప్రత్యేకత

BillBoard: వాహ్ తాజ్‌మహల్ టీ కాదు.. తబలాలో ను ప్రత్యేకత

వ్రాసిన వారు Stalin
May 26, 2024
06:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ నగరం నడిబొడ్డున ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్విరాన్‌మెంటల్‌ ఇంటరాక్టివ్‌ బిల్‌ బోర్డ్‌ను తాజ్ మహల్ టీ ఏర్పాటు చేసింది. ఈ ఘనతను సాధించిన బ్రూక్‌ బాండ్‌ తాజ్‌ మహల్ టీ గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. విజయవాడ జంక్షన్ లో మేఘ్ సంతూర్ పేరుతో వీనుల విందైన సంగీతంతో నగర ప్రజలను అలరిస్తోంది. రాబోయే వర్షాకాలాన్ని ప్రతిబింబించేలా హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో 2250 అడుగుల బిల్ బోర్డు ను ఏర్పాటు చేశారు.

Details 

ప్రత్యేకంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో రూపొందించారు

సాయంకాలం సమయంలో శాస్త్రీయ సంగీతం పై అభిరుచి వున్న వారంతా బిల్ బోర్డు వద్ద చేరి ఆస్వాదిస్తున్నారు. మంచి సాహిత్యం , కళలు, శాస్త్రీయ సంగీతం అంటే చెవులు కోసుకునే వారంతా చాలా సంతోషంగా వున్నారు. దీనిని ప్రత్యేకంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో రూపొందించారు. ఇది స్థానికులకు, బాటసారులకు అపూర్వమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది సాంకేతికత,రుతువులకు అనుగుణంగా సంగీతాన్ని అందించటం ఈ బిల్ బోర్డు ప్రత్యేకతగా చెప్పాలి.