LOADING...
Train Reservation Booking App : రైలులోబెర్త్ కోసం గొడవ అవసరం లేదు.. ఒక్క SMSతో సమస్యకు చెక్!
రైలులోబెర్త్ కోసం గొడవ అవసరం లేదు.. ఒక్క SMSతో సమస్యకు చెక్!

Train Reservation Booking App : రైలులోబెర్త్ కోసం గొడవ అవసరం లేదు.. ఒక్క SMSతో సమస్యకు చెక్!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైళ్లలో బెర్త్ లేదా సీటు కన్ఫర్మ్ లేకుండా ప్రయాణించడం ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగానే మారుతుంది. ముఖ్యంగా దూర ప్రయాణాల్లో ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ బెర్త్ ఖరారుకాకపోతే తీవ్ర అసౌకర్యాలు ఎదురవుతాయి. అంతేకాదు, కొంతమంది ఎలాంటి హక్కు లేకుండానే ఇతరులకు కేటాయించిన సీట్లు, బెర్తుల్లో కూర్చుంటారు. ఖాళీ చేయమని అడిగితే పట్టించుకోకపోవడం,కొన్నిసార్లు అయితే ఘర్షణలకు కూడా దారి తీస్తుంటాయి. అయితే, ఇలాంటి సమస్యలకు కేవలం ఒక్క మెసేజ్‌తోనే పరిష్కారం లభిస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు.

వివరాలు 

రైళ్లలోముందస్తు బుకింగ్ ద్వారా సీట్లు, బెర్తులు కేటాయిస్తారు

ప్రయాణ సమయంలో సీటు కోసం గొడవలు జరగడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఇటీవల బస్సుల్లో కూడా సీట్ల విషయమై వివాదాలు పెరిగి ప్రత్యక్ష దాడుల వరకూ వెళ్లిన ఘటనలు ఉన్నాయి. కానీ రైళ్లలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ముందస్తు బుకింగ్ ద్వారా సీట్లు, బెర్తులు కేటాయిస్తారు. అయినా సరే, కొంతమంది రిజర్వేషన్ లేకుండానే రైలులో ఎక్కి,ఇతరులకు కేటాయించిన స్థానాలను ఆక్రమించేస్తుంటారు. దీనిపై ప్రశ్నిస్తే వాగ్వాదానికి దిగడం కూడా జరుగుతుంది. అలాంటి పరిస్థితి మీకు ఎదురైతే, ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

వివరాలు 

పరిస్థితిని అర్థం చేసుకుని ఖాళీ చేస్తే..

సరైన విధానం పాటిస్తే సమస్య తేలికగా పరిష్కారమవుతుంది. మొదటగా, మీకు కేటాయించిన సీటులో కూర్చున్న వ్యక్తికి మీ రిజర్వేషన్ టికెట్‌ను చూపించి శాంతియుతంగా వివరించాలి. పరిస్థితిని అర్థం చేసుకుని ఖాళీ చేస్తే సమస్య అక్కడితో ముగుస్తుంది. ఒకవేళ టికెట్ చూపించిన తర్వాత కూడా అతడు లేదా ఆమె సీటు విడిచిపెట్టడానికి నిరాకరిస్తే, ఈ క్రింది చర్యలు తీసుకోవాలి.

Advertisement

వివరాలు 

TTEను సంప్రదించండి

సీటు లేదా బెర్తుకు సంబంధించిన సమస్య ఎదురైతే నేరుగా ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)ను కలవాలి. మీ సీటులో ఇతరులు కూర్చున్నారని ఫిర్యాదు చేస్తే, ఆయన జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని ఖాళీ చేయించే చర్యలు తీసుకుంటారు. SMS ద్వారా ఫిర్యాదు చేయండి TTEను సంప్రదించినా సమస్య పరిష్కారం కాకపోతే, రైల్వే అందిస్తున్న SMS సేవను వినియోగించుకోవచ్చు. వెంటనే 139 నంబర్‌కు ఒక మెసేజ్ పంపాలి. ఇందుకు ప్రత్యేకమైన ఫార్మాట్ ఉంటుంది. SEAT < PNR Number > < Seat Number > OCCUPIED BY UNKNOWN PASSENGER అని టైప్ చేసి 139కి పంపితే సరిపోతుంది.

Advertisement

వివరాలు 

RailMadad యాప్‌ ద్వారా ఫిర్యాదు

సమాచారం అందిన వెంటనే రైల్వే సిబ్బంది లేదా పోలీసులు మీ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. ఈ విధానం ఉన్నప్పుడు, సీటు కోసం అనవసరంగా గొడవ పడడం మంచిది కాదు. RailMadad యాప్‌ను ఉపయోగించి ఫిర్యాదు చేస్తే మరింత వేగంగా స్పందన లభిస్తుంది. యాప్‌లో వివరాలు నమోదు చేసిన వెంటనే సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకుంటారు.

వివరాలు 

RPF హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించండి

రైలులో సీటు సమస్యతో పాటు శాంతి భద్రతలకు సంబంధించిన ఏ ఇబ్బంది ఎదురైనా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సహాయం కోరవచ్చు. ఇందుకోసం 182 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. RPF సిబ్బంది వెంటనే స్పందించి అవసరమైన సహాయం అందిస్తారు. ఈ సూచనలు పాటిస్తే, రైలు ప్రయాణంలో సీటు లేదా బెర్తు సమస్యలు ఎదురైనప్పటికీ ప్రశాంతంగా, సురక్షితంగా పరిష్కారం పొందవచ్చు.

Advertisement