NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ఆరోగ్యం: నాన్ వెజ్ అలవాటు లేని వాళ్ళకు కావాల్సినంత ప్రోటీన్ అందించే ఆహరాలు
    తదుపరి వార్తా కథనం
    ఆరోగ్యం: నాన్ వెజ్ అలవాటు లేని వాళ్ళకు కావాల్సినంత ప్రోటీన్  అందించే ఆహరాలు
    ప్రోటీన్ ఎక్కువగా ఉండే గింజలు

    ఆరోగ్యం: నాన్ వెజ్ అలవాటు లేని వాళ్ళకు కావాల్సినంత ప్రోటీన్ అందించే ఆహరాలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 24, 2022
    01:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాంసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. చికెన్, గుడ్లు, సాల్మన్ చేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ వల్ల శరీరంలోని కణాలు వృద్ధి చెంది శరీరాన్ని పుష్టిగా ఉంచుతుంది.

    ప్రస్తుతం ఆహారం, ఆరోగ్యం పట్ల అందరికీ శ్రద్ధ పెరిగిపోయింది కాబట్టి క్వాలిటీ ఆహారాన్నే తీసుకోవాలని చూస్తున్నారు. అందుకే ఆరోగ్యాన్ని అందించే ప్రోటీన్ ఉన్న ఆహారాల వైపు అడుగులు వేస్తున్నారు.

    ఐతే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. మనకు కావాల్సిన ప్రోటీన్లు ఒకే ఆహారం నుండి లభించవు. ఒక్కో ఆహారంలో ఒక్కో రకమైన ప్రోటీన్ కనిపిస్తుంది.

    ప్రోటీన్లు కేవలం మాంసాహారంలోనే ఎక్కువగా దొరుకుతాయని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మొక్కల నుండి వచ్చే ఆహారాల్లోనూ ఇవి కావాల్సినంత లభిస్తాయి.

    ప్రోటీన్ ఆహారాలు

    పప్పులు, పచ్చబఠాణీలు, టోఫుల్లో ప్రోటీన్ లభ్యం

    మాంసహారంతో పోలికలను పక్కన పెడితే వెజ్ లో కూడా శరీరానికి కావల్సినంత ప్రోటీన్ ని అందించే ఆహారాలు ఉన్నాయి. గింజలు, పప్పులు, పచ్చ బఠాణీలు, సోయాపాలతో తయారయ్యే టోఫు, పీనట్ బట్టర్ లాంటి వాటిల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది.

    శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ దొరక్కపోతే అనేక అనారోగ్యాలు ఎదురవుతాయి. శరీరం ముడతలు పడటం మొదలవుతుంది. ఎముకలు బలహీనంగా మారతాయి.

    గోర్లు, వెంట్రుకలు, చర్మానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. వీటి నిర్మాణం, నిర్వహణ పూర్తిగా ప్రోటీన్ తో ముడిపడి ఉంటుంది.

    చిన్నపిల్లల్లో ఐతే పెరుగుదల ఆగిపోతుంది. ఇంకా కాలేయం పనితీరు దెబ్బతింటుంది. అందుకే శరీరానికి సరిపడా ప్రోటీన్ అందుతుందో లేదో చూసుకుంటూ తగినంత ప్రోటీన్ ఆహారాలను తీసుకోండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆరోగ్యకరమైన ఆహారం

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ఆరోగ్యకరమైన ఆహారం

    ప్రేగులలో టొమాటోల వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు జబ్బు
    చలికాలంలో చల్లగా హిమక్రిములు లాగించేద్దాం చలికాలం
    నిత్యం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు లైఫ్-స్టైల్
    మీ డైట్ ని మరింత ఆరోగ్యంగా మార్చే ఆయుర్వేద ఆహారాలు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025