Sorakaya garelu: వేసవిలో బాడీని కూల్‌గా ఉంచే సొరకాయ గారెలు.. ఒకసారి ట్రై చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
మన పూర్వీకుల ఆహారపు అలవాట్లలో సొరకాయ గారెలకు ప్రత్యేక స్థానం ఉండేది. ఇవి శక్తినిచ్చే పోషకాహారంగా మాత్రమే కాకుండా, శరీరానికి సహజమైన చల్లదనాన్ని కూడా అందిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వీటిని "పొలం గారెలు" అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ రుచికరమైన సొరకాయ గారెలను తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.
వివరాలు
కావలసిన పదార్థాలు ఇవే..
ఒక కప్పు సొరకాయ ముక్కలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చులు ఒక చిన్న అల్లం ముక్క 10 కరివేపాకు ఆకులు అర కట్ట కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి తగినంత ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్లు లేదా అర కప్పు నూనె
వివరాలు
తయారీ విధానం ఇదే..
ముందుగా సొరకాయ ముక్కలను శుభ్రంగా కడిగి, కొద్దిగా ఉప్పు కలిపిన నీటిలో సుమారు రెండు గంటల పాటు నానబెట్టాలి. అనంతరం వాటిని తీసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రోటిలో దంచుకునే అవకాశం ఉంటే కొద్దిగా కచ్చాపచ్చగా దంచినా సరిపోతుంది. అయితే మిశ్రమం మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు జోడించి మరోసారి గ్రైండ్ చేయాలి.
వివరాలు
గారెలు సిద్ధం చేసే విధానం ఇదే..
సిద్ధం చేసిన సొరకాయ పేస్ట్‌లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అన్ని పదార్థాలు సమంగా కలిసేలా మిశ్రమాన్ని సిద్ధం చేసుకుంటే గారెలు మరింత రుచిగా వస్తాయి. స్టవ్‌పై ఒక పాన్ లేదా కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. చేతికి కొద్దిగా నీరు రాసుకుని సిద్ధం చేసిన మిశ్రమాన్ని చిన్న గారెల ఆకారంలో చేసుకోవాలి. వాటిని జాగ్రత్తగా వేడి నూనెలో వేసి మధ్యస్థ మంటపై వేయించాలి. గారెలు బంగారు రంగులోకి మారే వరకు ఒక వైపు వేయించి, తరువాత మరో వైపు తిప్పి సమంగా కాల్చుకోవాలి.