IRCTC Andaman Tour : హైదరాబాద్ నుంచి అండమాన్‌కు స్పెషల్ టూర్..! 6 రోజులు-5 రాత్రులు, ఈ నెల 30నే ప్రయాణం!
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి మొదలైంది... ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వేడిలో చల్లని సముద్ర తీరాల్లో సేదతీరాలని అనుకునేవారికి గుడ్‌న్యూస్. ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా అండమాన్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ నెల 30వ తేదీన ప్రయాణం ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ మొత్తం 6 రోజులు (5 రాత్రులు) ఉంటుంది. 'అమెజింగ్ అండమాన్ EX హైదరాబాద్' పేరుతో అందుబాటులో ఉన్న ఈ టూర్ ఫ్లైట్ ప్రయాణంతో నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా పోర్ట్ బ్లెయిర్ (శ్రీవిజయపురం), హావ్‌లాక్, నెయిల్ దీవులను సందర్శించే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం IRCTC అధికారిక వెబ్‌సైట్ [https://www.irctctourism.com/](https://www.irctctourism.com/) ను సందర్శించవచ్చు.
Details
టూర్ షెడ్యూల్ ఇలా…
మొదటి రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి పోర్ట్ బ్లెయిర్ (శ్రీవిజయపురం) విమానాశ్రయానికి చేరుకుంటారు. లంచ్ అనంతరం సెల్యులార్ జైలు, మ్యూజియంను సందర్శిస్తారు. తరువాత కార్బిన్స్ కోవ్ బీచ్ వద్ద సేదతీరుతారు. సాయంత్రం సెల్యులార్ జైలులో లైట్ అండ్ సౌండ్ షోను వీక్షిస్తారు. రాత్రి పోర్ట్ బ్లెయిర్‌లోనే బస ఉంటుంది. రెండో రోజు హావ్‌లాక్ దీవికి చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. భోజనం అనంతరం ప్రసిద్ధి చెందిన Radhanagar Beachను సందర్శిస్తారు. హావ్‌లాక్‌లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది. మూడో రోజు హోటల్‌లో అల్పాహారం చేసిన తర్వాత వాటర్ స్పోర్ట్స్ కోసం ఎలిఫెంట్ బీచ్కు వెళ్తారు. సాయంత్రం హోటల్‌కు తిరిగి వస్తారు. హావ్‌లాక్ ద్వీపంలోనే డిన్నర్, రాత్రి బస.
Details
నాల్గో రోజు
బ్రేక్‌ఫాస్ట్ అనంతరం చెక్ అవుట్ చేసి కాలా పత్తర్ బీచ్‌ను సందర్శిస్తారు. క్రూయిజ్ సమయాల ప్రకారం నెయిల్ దీవికి బయలుదేరుతారు. హోటల్‌లో చెక్ ఇన్ చేసి సాయంత్రం సూర్యాస్తమయాన్ని ఆస్వాదించేందుకు సీతాపూర్ బీచ్, లక్ష్మణ్‌పూర్ బీచ్‌లను దర్శిస్తారు. నెయిల్ దీవిలో డిన్నర్, రాత్రి బస. ఐదో రోజు అల్పాహారం అనంతరం చెక్ అవుట్ చేసి భరత్‌పూర్ బీచ్‌ను సందర్శిస్తారు. తరువాత క్రూయిజ్ ద్వారా తిరిగి పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ చేసి అక్కడే డిన్నర్, రాత్రి బస. ఆరో రోజు హోటల్‌లో అల్పాహారం చేసిన తర్వాత తెల్లవారుజామున చెక్ అవుట్ చేసి పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు విమానం ఎక్కాలి. మధ్యాహ్నం వరకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
Details
టూర్ ప్యాకేజీ ధరలు
హైదరాబాద్ - అండమాన్ ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి కంఫర్ట్ క్లాస్ సింగిల్ ఆక్యుపెన్సీ: రూ. 65,850 డబుల్ ఆక్యుపెన్సీ: ఒక్కొక్కరికి రూ. 48,700 ట్రిపుల్ ఆక్యుపెన్సీ: ఒక్కొక్కరికి రూ. 46,950 ఈ ప్యాకేజీకి సంబంధించిన సందేహాల కోసం [bsashidhar5605@irctc.com](mailto:bsashidhar5605@irctc.com) కు మెయిల్ చేయవచ్చు. వేసవి వేడిని దూరం పెట్టి సముద్ర సోయగాల్లో విహరించాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ముందుగానే బుకింగ్ చేసుకుంటే సీట్లు సురక్షితం.