Migrate: 2100 నాటికి 38% మంది పెద్ద నగరాల్లోనే.. తాజా అధ్యయనం వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. ఈ ధోరణి కొనసాగితే 2100 నాటికి ప్రపంచ జనాభాలో సుమారు 38 శాతం మంది పెద్ద నగరాల్లోనే నివసించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. నగరాల వైపు పెరుగుతున్న వలసలు 1975లో ప్రపంచ జనాభాలో కేవలం 11శాతం మంది మాత్రమే పెద్ద నగరాల్లో నివసించగా,ప్రస్తుతం ఆ సంఖ్య 24 శాతానికి చేరింది. ఇక వచ్చే 25సంవత్సరాల్లో మరో 100కోట్ల మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే అవకాశముందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ మార్పు వేగాన్ని వివరిస్తూ, ప్రతి రెండు నెలలకు ఒక కొత్త న్యూయార్క్ నగరం ఏర్పడుతున్నంత స్థాయిలో ప్రపంచ పట్టణ జనాభా పెరుగుతోందని 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.
వివరాలు
పెద్ద నగరాలకే ఎక్కువ ప్రాధాన్యం
10లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో నివసించే వారి సంఖ్య 45కోట్లకు చేరుతుందని అధ్యయనం అంచనా వేసింది. చిన్న పట్టణాలతో పోలిస్తే భారీ నగరాల్లో జనాభా వృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని పరిశోధకులు వెల్లడించారు. నగరీకరణకు ప్రధాన కారణాలు ఉపాధి అవకాశాలు, మెరుగైన వైద్య సేవలు,ప్రముఖ విశ్వవిద్యాలయాలు,ఆధునిక మౌలిక సదుపాయాలు,ఇతర అభివృద్ధి అవకాశాలు పెద్ద నగరాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండటమే పట్టణీకరణ వేగంగా పెరగడానికి ప్రధాన కారణమని అధ్యయనం స్పష్టం చేసింది. అలాగే,1975 నుంచి 2025 మధ్యకాలంలో ఆయా దేశాల్లో 10లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలు,ఇతర నగరాలతో పోలిస్తే సగటున 7.3శాతం వేగంగా అభివృద్ధి చెందాయని పరిశోధకులు తెలిపారు. ప్రపంచంలోని 99దేశాలకు చెందిన నగరాల పరిస్థితులను విశ్లేషించి ఈ అంచనాలను రూపొందించారు.