
Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
మనిషి జీవితంలో భయం అనేది వయస్సుతో సంబంధం లేకుండా ఎప్పుడైనా, ఎవరికైనా వస్తుంది.
అది విద్యార్ధి అయినా కావచ్చు, వ్యాపారవేత్త అయినా కావచ్చు, సాధారణ వ్యక్తి అయినా కావచ్చు.
చదువులో విఫలమవుతామన్న భయం విద్యార్థిని వెంటాడుతుంది.
వ్యాపారంలో నష్టాలు వస్తాయేమోనన్న ఆందోళన వ్యాపారవేత్తను వెంటాడుతుంది. ఇలా ప్రతి ఒక్కరికీ భయం అనే భావన ఏదో ఒక రూపంలో ఉంటుంది.
అయితే ఈ భయం ఎక్కడనుంచి వస్తుందో తెలుసా? అది మీ మనస్సులోనే భయం అనేది ఉంటుంది
మనసులోని అనిశ్చితి, అస్థిరతే భయంగా మారుతుంది. ఈ భయం ఎంత పెద్దదైనా, అది మన విజయాన్ని అడ్డుకునే శక్తిగా మారుతుంది.
వివరాలు
5 ప్రేరణాత్మక వాక్యాలు ఇవే..
కానీ మనస్సు నుండి భయాన్ని పూర్తిగా తొలగించగలిగితే,ఎలాంటి పని అయినా సాధ్యమే.ఇప్పుడు భయాన్ని జయించేందుకు ప్రేరణ ఇచ్చే అయిదు ముఖ్యమైన ప్రేరణాత్మక వాక్యాలను చూద్దాం:
ప్రయత్నంలోనూ విజయంలోనూ నమ్మకం పెంచుకోండి:ఏ కొత్త పనైనా ప్రారంభించే ముందు చాలా మందిలో విఫలమవుతామన్న భయం కలుగుతుంది. ఈ భయంతో ఆ పని ఆరంభించకముందే మానేస్తారు లేదా మధ్యలో ఆపేస్తారు.కానీ ఎవరైతే సిన్సియారిటీతో, స్థిరమైన కృషితో ముందుకు సాగుతారో, వారు ఆలస్యమైనా విజయం సాధిస్తారు.
మీ భయాన్ని ఎదుర్కొనడానికి దానినే పునరావృతం చేయండి: మీరు ఏ పని చేయడాన్ని భయపడుతున్నారో,అదే పనిని మళ్లీ మళ్లీ చేస్తూ ఉండండి. ఈ పద్ధతే భయాన్ని అధిగమించడంలో అత్యంత ప్రభావవంతమైన మార్గం.అలాంటి ప్రయత్నాలే మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చి విజయం వైపు నడిపిస్తాయి.
వివరాలు
5 ప్రేరణాత్మక వాక్యాలు ఇవే..
భయం వచ్చినప్పుడు పనిలో నిమగ్నం అవ్వండి: జీవితంలో భయాన్ని దగ్గరకి రానివ్వకండి. ఒక్కసారి ఎప్పుడైనా భయం కలిగితే, దాని గురించి పదేపదే ఆలోచించకుండా ఏదో ఒక కార్యంలో నిమగ్నమవ్వండి. భయంతో పారిపోవద్దు.. ధైర్యంతో నిలవండి.
ధైర్యం అంటే భయంలేకపోవడం కాదు: భయం లేని వాడే ధైర్యవంతుడు అనే భావన తప్పు. నిజమైన ధైర్యం అంటే భయాన్ని అంగీకరించి, దానిని జయించడం. భయాన్ని ఎదుర్కొనగలిగే మనసు కలవారే నిజమైన ధైర్యవంతులు.
భయాన్ని జయించడానికి పనిలో తలమునక అవ్వండి: భయాన్ని పోగొట్టుకోవాలంటే ఖాళీగా కూర్చొని ఆ భయాన్ని పదే..పదే ఆలోచించకుండా,దృష్టిని మళ్లించేలా ఉండాలి. మనశ్శాంతి కోసం ఏదైనా సృజనాత్మకమైన లేదా రాబడి కలిగించే పనిలో తలమునక అవ్వండి. దాంతో భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది.