
Stomach Cancer: కడుపు క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియాలో క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొట్ట క్యాన్సర్ కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు.
కడుపులో ఉండే కణాలలో మొదలయ్యే ఒక రకమైన క్యాన్సర్‌గా చెప్పొచ్చు.
ప్రారంభంలో వీటి లక్షణాలు స్పష్టంగా ఉండకపోవడంతో వీటిని గుర్తించటం చాలా కష్టమవుతుంది.
క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్న క్రమంలో కడుపులోని ఇతర భాగాలకు, సమీపంలోకి ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది.
చికిత్స చేయకుండా వదిలేస్తే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
అనారోగ్యకరమైన జీవనశైలి, జన్యపరమైన కారణాలు, జంక్ ఫుడ్ తినటం వల్ల ఇండియాలో కడుపు క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నిపుణులుచెబుతున్నారు.
Details
స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే క్యాన్సర్ లక్షణాలు ఎక్కువ
ఈ కడుపు క్యాన్సర్ ప్రధానంగా 50 ఏళ్లు పైబడిన వ్యక్తులకు వస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఈ సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది.
కడుపు క్యాన్సర్ యొక్క లక్షణాలు
నిరంతర కడుపు నొప్పి లేదా అసౌకర్యం
బరువు తగ్గడం
ఆకలి లేకపోవడం
వికారం
వాంతులు
మలంలో రక్తం
ఈ క్యాన్సర్ ను నివారించడానికి ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలి. తాజా పండ్లు, కూరగాయాలతో సమృద్ధిగా సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.
ధూమపానానికి దూరంగా ఉండాలి. తరుచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.