LOADING...
Summer Drinks: వేసవి తాపాన్ని తీర్చే 'మ్యాంగో లస్సీ'.. చల్ల చల్లని కూల్ కూల్
వేసవి తాపాన్ని తీర్చే 'మ్యాంగో లస్సీ'.. చల్ల చల్లని కూల్ కూల్

Summer Drinks: వేసవి తాపాన్ని తీర్చే 'మ్యాంగో లస్సీ'.. చల్ల చల్లని కూల్ కూల్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 10, 2026
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు, పుచ్చకాయలు, మామిడి పండ్లు, ఐస్‌క్రీమ్‌లు, వివిధ రకాల జ్యూస్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ జాబితాలో లస్సీ కూడా ఒక ముఖ్యమైన పానీయం. తీవ్రమైన ఎండలో చల్లగా ఒక గ్లాస్ లస్సీ తాగితే శరీరం తేలికగా, తాజాగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది కూల్‌డ్రింక్స్‌కు బదులుగా లస్సీని ఎంచుకుంటారు. కొందరు ఇంట్లోనే దీనిని తయారు చేసుకోవడం ఇష్టపడుతారు. సాధారణంగా చేసే విధానానికి భిన్నంగా, వేసవికి ప్రత్యేకమైన మామిడి పండుతో లస్సీ తయారు చేస్తే రుచి మరింత పెరుగుతుంది. తక్కువ ఖర్చుతోనే ఎంతో రుచికరమైన పానీయాన్ని ఆస్వాదించవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ మ్యాంగో లస్సీ తయారీ విధానం తెలుసుకుందాం.

వివరాలు

కావలసిన పదార్థాలు ఇవే

మామిడిపండు ముక్కలు - 2 కప్పులు పంచదార - 4 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు - 1 కప్పు యాలకుల పొడి - అర టీ స్పూన్ ఉప్పు - చిటికెడు జీడిపప్పు ముక్కలు - 1 టేబుల్ స్పూన్ ఐస్ క్యూబ్స్ - అవసరమైనంత పెరుగు - 2 కప్పులు డ్రై ఫ్రూట్స్ - కొద్దిగా

వివరాలు

తయారీ విధానం ఇదే..

ముందుగా అవసరమైన పరిమాణంలో మామిడిపండ్లను శుభ్రంగా కట్ చేసి సిద్ధం చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్‌లో ఈ మామిడి ముక్కలు, పంచదార, కాచి చల్లార్చిన పాలను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అనంతరం ఈ మిశ్రమంలో పెరుగు, జీడిపప్పు ముక్కలు, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి మరోసారి బాగా కలిసేలా గ్రైండ్ చేయాలి. చివరిగా ఐస్ క్యూబ్స్ వేసి మరొకసారి బ్లెండ్ చేసి, సిద్ధమైన లస్సీని సర్వింగ్ గ్లాస్ లేదా బౌల్‌లో పోయాలి. పైపైగా కొద్దిగా మామిడి ముక్కలు, డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి సర్వ్ చేయాలి. ఇంతే, రుచికరమైన మ్యాంగో లస్సీ సిద్ధంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి పరిమాణాలు పెంచి ఎక్కువ మోతాదులో కూడా తయారు చేసుకోవచ్చు.

Advertisement

వివరాలు

ఇలా చేస్తే ఆరోగ్యం..రుచి..

బాగా పండిన, తీపి ఎక్కువగా ఉన్న మామిడి పండ్లను ఉపయోగిస్తే లస్సీ రుచి మరింత మెరుగ్గా ఉంటుంది. పంచదార పరిమాణాన్ని మీ రుచికి అనుగుణంగా మార్చుకోవచ్చు. కావాలంటే పంచదార స్థానంలో తేనె కూడా ఉపయోగించవచ్చు. మామిడి పండు తీపిని బట్టి స్వీట్‌ను తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం మంచిది. లస్సీకి తియ్యటి, మందమైన పెరుగు ఉపయోగిస్తే మంచి రుచి వస్తుంది. పుల్లటి పెరుగు వాడితే రుచి మారే అవకాశం ఉంది. రోజ్ వాటర్ కలిపితే లస్సీకి అదనపు సువాసన, రుచి వస్తాయి. మరింత క్రీమీ టెక్స్చర్ కోసం నానబెట్టిన బాదం లేదా జీడిపప్పును పేస్ట్ చేసి కలిపితే ఇంకా రుచిగా ఉంటుంది.

Advertisement