Page Loader
Sweet Potato : వీటిని తింటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..కళ్లద్దాలను పక్కన పెట్టేస్తారు
వీటిని తింటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా

Sweet Potato : వీటిని తింటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..కళ్లద్దాలను పక్కన పెట్టేస్తారు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 28, 2023
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనకు అందుబాటులో ఉండే అనేక కూరగాయల్లో కందగడ్డ(చిలగడదుంపలు) ఒకటి. వీటితో చాలా మంది కూరలు చేసుకుని తింటారు. కందగడ్డలు పోషకాహారాలు. వీటిని ఉడకబెట్టుకుని పైన కాస్త ఉప్పు చల్లి తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. అనేక పోషకాలను అందిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలను పొందవచ్చు. శివరాత్రి సందర్భంగా జాగారం చేసేవారికి కందగడ్డ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. నీరసం నుంచి కాపాడి శరీరానికి శక్తినిస్తుంది. అందువల్లే ఆ పరమపవిత్ర రోజున శక్తి కోసం భక్తులు కందగడ్డను ఆశ్రయిస్తారు. కందగడ్డలో ఉండే పోషకాలివే : ఉప‌వాసం స‌మ‌యంలో శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిలు త‌క్కువవుతుంటాయి. ఫలితంగా స్పృహ త‌ప్పే అవకాశం ఉంటుంది. అయితే కంద‌గ‌డ్డ‌లు తింటే శ‌రీరంలోని పలు భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా వేగ‌వంతవుతుంది.

details

ఇందులో విట‌మిన్ Dతో ఎముక‌ల‌కు బూస్ట్ 

ఇందులోని మిన‌ర‌ల్స్‌, ఐరన్, శ‌రీరంలోని క‌ణాల సామ‌ర్థ్యాన్ని పెంచుతాయి. కంద‌గ‌డ్డ‌లో బీటా కెరోటిన్‌, విట‌మిన్ B6,C,E, Iron అధికంగా ఉంటాయి. వీటిని తిన్న వెంట‌నే శ‌క్తి వ‌స్తుంది. ఇదే సమయంలో ఇందులో ఉండే అధిక ఫైబర్ మూలానా కడుపు నిండిన భావన క‌లుగుతుంది. శ‌క్తి సైతం త్వరగా అందుకుని యాక్టివ్ గా ఉండగలం.ఇందులో విట‌మిన్ D సైతం అధికంగానే ఉండటంతో ఎముక‌ల‌కు బ‌లం చేకూరుతుంది. చిలగడదుంపల్లోని పోషకాలు తెలుసా : 1. పోషకాల గనిగా ఉన్న ప్రోటీన్లు, ఫైబర్‌, విటమిన్లు A, C, B6, మాంగనీస్‌, పొటాషియం, పాంటోథెనిక్‌ యాసిడ్‌, రాగి, నియాసిన్‌ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఫ్రీ ర్యాడికల్స్'ను నాశనం చేసి కణాలను ఆరోగ్యకరంగా ఉంచుతాయి.ఫలితంగా క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుంది.

DETAILS

రోజూ ఓ పూట కందగడ్డతో అనేక లాభాలు

కందగడ్డతో రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు,ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. 2. చిలగడదుంపలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్‌ మలబద్దకం, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం సమస్యలను దూరం చేస్తుంది. 3. కందగడ్డ బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. రోజూ వీటిని తింటుంటే బరువు తగ్గడం తేలిక. 4. చిలగడదుంపల్లో ఆంథోసయనిన్స్‌(యాంటీ ఆక్సిడెంట్లు) క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తాయి. 5. ఇందులోని విటమిన్‌ A కంటి చూపును రక్షిస్తుంది. కంటి సమస్యలు ఉన్నవారు రోజూ వీటిని తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. కళ్లద్దాలను వాడాల్సిన అవసరాన్ని తగ్గించే సత్తా వీటికి ఉందని నిపుణలు అంటున్నారు. 6. వీటిని తింటే షుగర్‌, కొలెస్ట్రాల్‌ తగ్గుతాయి. డయాబెటిస్‌ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి.