
మీ కడుపు ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచే ఫైబర్ పోషకాలు గల ఆహారాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం చాలామంది జీర్ణ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. మలబద్ధకం, ఆహారం జీర్ణంకాక పోవడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి.
ఇలాంటి సమస్యలు సరైన ఆహారం తీసుకోకపోవడం వలన కలుగుతాయని ఎక్కువ మందికి తెలియదు.
ప్రస్తుతం మీ కడుపు ఆరోగ్యం సరిగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
కడుపు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.
ఫైబర్ అంటే పీచు పదార్థం. ఆహారాల్లో రెండు రకాల ఫైబర్ ఉంటుంది. ఒకటి నీటిలో కరిగే ఫైబర్, మరొకటి నీటిలో కరగని ఫైబర్.
ప్రస్తుతం ఫైబర్ కలిగిన ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Details
ఓట్స్
పొద్దున్న పూట బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తినడం చాలా మంచిది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇందులోని ఫైబర్ కారణంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.
పప్పులు:
పప్పులు, చిక్కుల్లలో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. రోజువారి ఆహారంలో పప్పులను కచ్చితంగా భాగం చేసుకోవాలి.
ఆపిల్:
రోజుకొక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ ని దూరం పెట్టవచ్చని చెబుతారు. ఆపిల్ లో నీటిలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.
స్వీట్ పొటాటో:
దుంప జాతికి చెందిన స్వీట్ పొటాటోలో ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల కడుపునకు మంచి ఆరోగ్యం అందుతుంది.