Mark Carney: ట్రంప్ వార్నింగ్ ఎఫెక్ట్.. 'మనమే మనకు అతిపెద్ద వినియోగదారులు కావాలి': మార్క్ కార్నీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్యం చేస్తే, తమ దేశ వస్తువులన్నింటికి 100 శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో,కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆదివారం స్పందించారు. ''ఇతర దేశాలు ఏం చేస్తాయన్నది మన చేతుల్లో లేదు.అందుకే మనం ఏమి చేయగలమో దానిపైనే దృష్టి పెట్టాలి. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థకు విదేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి.ఈ సమయంలో ఇతర దేశాల సహానుభూతిపై ఆధారపడకూడదు.మనమే మనకు పెద్ద వినియోగదారులు కావాలి.కాబట్టి కెనడా ఉత్పత్తులను కొనుగోలు చేయండి.కెనడాను మనమంతా కలిసికట్టుగా ఉంటేనే బలంగా ఎదుగుతాం'' అని దేశ ప్రజలకు కార్నీ పిలుపునిచ్చారు. కాగా, ట్రంప్ పై తన పోస్టులో కార్నీని'గవర్నర్'గా ఉద్దేశపూర్వకంగా పిలవడం,ఒక దేశాధినేతను పరోక్షంగా అవమానించడం అని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మార్క్ కార్నీ చేసిన ట్వీట్
As we head into a new session of Parliament, our new government is focused on our core missions — to protect our communities, build our economy, and empower Canadians with new opportunities.
— Mark Carney (@MarkJCarney) January 25, 2026
Together, we’re building Canada strong. pic.twitter.com/qSR3YSjjVL