Teddy Day : ప్రేమకు చిహ్నమైన టెడ్డీ డే.. ఎప్పుడు, ఎలా మొదలైందో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతేడాది ఫిబ్రవరి 10న టెడ్డీ డేను జరుపుకుంటారు. ఇది కేవలం టెడ్డీ బొమ్మలు బహుమతిగా ఇచ్చే రోజే కాదు. ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగాలను వ్యక్తపరచుకునే ఒక ప్రత్యేక సందర్భం. ముఖ్యంగా వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా ప్రేమికులు ఈ రోజున టెడ్డీ బేర్లను గిఫ్ట్‌గా ఇస్తూ తమ మనసులోని ప్రేమను చెప్పుకుంటారు. అయితే టెడ్డీ డే ఎలా ప్రారంభమైంది? వాలెంటైన్స్ వీక్‌లో దీనికి చోటు ఎలా దక్కింది? టెడ్డీ డే వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Details
టెడ్డీ డే ఎందుకు జరుపుకుంటారు?
టెడ్డీ బేర్లు ప్రేమ, ఆప్యాయత, అమాయకత్వానికి ప్రతీకలుగా భావిస్తారు. మృదువైన ఈ బొమ్మలు మనసుకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా ఒత్తిడిని తగ్గించడంలో కూడా సాయపడతాయి. దగ్గరగా ఉంచుకుంటే ఒక ప్రత్యేకమైన భరోసా, ఆత్మీయతను కలిగిస్తాయి. అందుకే ప్రేమికులు టెడ్డీ బేర్‌ను తమ ప్రేమకు చిహ్నంగా భావించి, ప్రియమైన వారికి బహుమతిగా ఇస్తుంటారు. ఇది సంబంధాలను మరింత బలపరిచే సంకేతంగా కూడా భావిస్తారు.
Details
టెడ్డీ డే చరిత్ర
టెడ్డీ బేర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన కథ 1902లో ప్రారంభమైంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ వేట కోసం తన సహాయకులతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో గాయపడిన ఒక ఎలుగుబంటిని ఆయన ఎదుటకు తీసుకొచ్చారు. అయితే, రూజ్‌వెల్ట్ ఆ ఎలుగుబంటిని చంపడానికి నిరాకరించి దాన్ని విడిచిపెట్టారు. ఈ సంఘటన ఆధారంగా ప్రసిద్ధ కార్టూనిస్ట్ క్లిఫోర్డ్ బెర్రీమాన్ ఒక కార్టూన్ రూపొందించారు. ఆ కార్టూన్‌ను చూసిన బొమ్మల తయారీదారు మారిస్ మిచ్చమ్‌కు ఒక ఆలోచన వచ్చింది.
Details
'టెడ్డీ బేర్' గా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ
ఆయన ఎలుగుబంటి ఆకారంలో ఒక మృదువైన బొమ్మను తయారు చేసి, అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ ముద్దుపేరు 'టెడ్డీ'ను గుర్తుచేస్తూ దానికి 'టెడ్డీ బేర్' అని పేరు పెట్టారు. ఆ బొమ్మను అధ్యక్షుడికి అంకితం చేశారు. ఆ తరువాత టెడ్డీ బేర్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. కాలక్రమేణా అది ప్రేమకు, ఆప్యాయతకు చిహ్నంగా మారింది. దీంతో వాలెంటైన్స్ వీక్‌లో నాల్గవ రోజైన ఫిబ్రవరి 10న టెడ్డీ డేను ప్రత్యేకంగా జరుపుకోవడం మొదలైంది.