
Thailand Visit: సంక్రాంతి సెలవుల్లో థాయ్‌లాండ్ వెళ్లండి.. వీసా కూడా లేకుండానే..
ఈ వార్తాకథనం ఏంటి
మరికొన్ని రోజుల్లో సంక్రాంతి సెలవులు రాబోతున్నాయి. ఈ సెలవు రోజుల్లో పిల్లలతో విహారయాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నారా?
అయితే విహార యాత్రలకు వెళ్లే భారతీయులకోసం థాయ్‌లాండ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఆ దేశ పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో థాయిలాండ్ ప్రభుత్వం భారతీయ పౌరులు వీసా లేకుండా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది.
దీంతో మీరు వీసా లేకుండానే థాయ్ లాండ్‌లో నెలరోజుల పాటు ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ 2024 మే 10వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది.
ఒక వేళ మీకు ఇప్పుడు కూదరడం లేదా? కనీసం వేసవి సెలవులకైనా ప్లాన్ చేసుకోవచ్చు.
ఇంతకీ థాయ్ లాండ్ వెళ్లి మీరు చూడాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
పర్యాటకం
బ్యాంకాక్
థాయ్‌లాండ్‌లో సందర్శించదగిన ప్రసిద్ధ ప్రదేశాలలో రాజధాని నగరం బ్యాంకాక్ ఒకటి.
ఇక్కడి బీచ్‌లు, రాజభవనాలు, దేవాలయాలు కాస్మోపాలిటన్ అనుభూతిని కలిగిస్తాయి.
షాపింగ్‌కు బ్యాంకాక్ అత్యుత్తమ ప్రదేశం. ప్రపంచంలోనే బెస్ట్ 4 బార్లు ఇక్కడ ఉన్నాయి.
గ్రాండ్ ప్యాలెస్
థాయిలాండ్‌లోని ఉత్తమ పర్యాటక ప్రాంతాల్లో బ్యాంకాక్‌లోని గ్రాండ్ ప్యాలెస్ ఒకటి.
దాని చారిత్రక ప్రాముఖ్యత, హస్తకళ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవాలి. 150ఏళ్ల చరిత్ర గల ఈ ప్యాలెస్ థాయ్ రాజ వంశాలకు సింబల్‌గా చెబుతుంటారు.
ఈ ప్యాలెస్‍ను సందర్శించడానికి నిత్యం వందలాదిగా విదేశీ పర్యటకులు వస్తుంటారు.
పర్యాటకం
అయుతయ ( అయోధ్య)
థాయ్‌లాండ్‌లో పర్యటించదగ్గ మరొక ప్రదేశం అయుతయ. దీన్ని అయోధ్యగా కూడా పిలుస్తారు.
ఈ ప్రాంతం 417 సంవత్సరాల పాటు థాయ్‌లాండ్ రాజధానిగా ఉంది. శతాబ్దాల నాటి అద్భుతమైన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. పర్యాటకులను ఆకర్శిస్తున్నాయి.
ఈప్రాంతం యునెస్కోతో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
చియాంగ్ మాయి
దేశంలోని విభిన్న కళలను చూడాలనుకునే పర్యాటకులకు చియాంగ్ మాయి గొప్ప పర్యాటక ప్రదేశం.
ఇది పురాతన కట్టడాలు, దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలకు ఆలవాలం.
ఇక్కడ కొండల్లో ట్రెక్కింగ్ అనేది ప్రత్యేకం. బౌద్ధ దేవాలయాలకు చియాంగ్ మాయి ప్రాంతం నిలయంగా ఉంది.
ఇది అత్యధికంగా సందర్శించే థాయ్‌లాండ్ పర్యాటక ప్రదేశాలలో ఒకటి.