Loading...
Thandai Masala Recipe: శరీరానికి చల్లదనం ఇచ్చే తండై… ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా
శరీరానికి చల్లదనం ఇచ్చే తండై… ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా

Thandai Masala Recipe: శరీరానికి చల్లదనం ఇచ్చే తండై… ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా

వ్రాసిన వారు Moogati Shabari
May 02, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు సహాయపడే పానీయాలలో తండై ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇది సంప్రదాయ భారతీయ పానీయం మాత్రమే కాకుండా, రుచి, సువాసన, పోషక విలువల సమ్మేళనంగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో దీనిని సేవిస్తే అలసట తగ్గి, శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. బయట దొరికే రెడీమేడ్ మిశ్రమాల కంటే ఇంట్లో తయారుచేసే తండై మసాలా శుద్ధిగా, ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. ఇందులో ఉపయోగించే డ్రైఫ్రూట్స్, గింజలు, సుగంధ ద్రవ్యాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, లోపల నుంచే చల్లదనాన్ని కలిగిస్తాయి. సోంపు, గసగసాలు, కుంకుమపువ్వు వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

వివరాలు

తండై మసాలా కోసం అవసరమైన పదార్థాలివే..

అర కప్పు బాదం,

జీడిపప్పు, పిస్తా రెండు టేబుల్ స్పూన్లు

సోంపు రెండు టేబుల్ స్పూన్లు

పుచ్చకాయ గింజలు,

గసగసాలు 25 నుండి 30

పచ్చి యాలకులు ఒక టేబుల్ స్పూన్

నల్ల మిరియాలు 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు

ఎండిన గులాబీ రేకులు అర టీస్పూన్

కుంకుమపువ్వు

వివరాలు

తయారీ విధానం ఇదే..

మొదట అన్ని డ్రైఫ్రూట్స్, గింజలను శుభ్రపరిచి బాగా ఆరబెట్టాలి.

వాటిలో తేమ ఉండకూడదు. తరువాత యాలకులు, నల్ల మిరియాలు, సోంపు, గసగసాలను మిక్సర్‌లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.

ఆపై బాదం, జీడిపప్పు, పిస్తా, పుచ్చకాయ గింజలను కలిపి మళ్లీ గ్రైండ్ చేయాలి.

ఈ మిశ్రమం మీ ఇష్టానికి అనుగుణంగా కొద్దిగా గరుకుగా లేదా మెత్తగా చేసుకోవచ్చు.

చివరగా ఎండిన గులాబీ రేకులు, కుంకుమపువ్వు వేసి స్వల్పంగా మళ్లీ రుబ్బాలి.

దీంతో సువాసనగల తండై మసాలా సిద్ధమవుతుంది. తయారైన మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

తరువాత గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేయాలి. దీన్ని చల్లని, పొడి ప్రదేశంలో లేదా ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువకాలం తాజాగానే ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

తండై తయారు చేసే విధానం ఇదే..

ఒక గ్లాస్ చల్లని పాలలో 1 లేదా 2 టీస్పూన్ల తండై మసాలా వేసి, అవసరమైనంత పంచదార కలిపి బాగా కలపాలి.

చల్లగా సర్వ్ చేస్తే రుచి మరింత మెరుగవుతుంది. ఇలా ఇంట్లోనే తండై మసాలా తయారుచేసుకుని వేసవిలో శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోండి.

ఒకసారి రుచి చూసిన తర్వాత మళ్లీ మళ్లీ తాగాలనిపించే పానీయం ఇది.

ADVERTISEMENT