Health Benefits of Pumpkin : గుమ్మడికాయలో దాగున్న ఆరోగ్య రహస్యాలు.. రోజూ తింటే లాభాలే!
ఈ వార్తాకథనం ఏంటి
వంటింట్లో సాధారణంగా హల్వా, పప్పు, సాంబార్, సూప్‌ల కోసం ఉపయోగించే గుమ్మడికాయ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్లు, మినరల్స్, ఫైబర్ సమృద్ధిగా ఉండే ఈ కూరగాయ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు గుమ్మడికాయ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
వివరాలు
కంటి ఆరోగ్యానికి మేలు
గుమ్మడికాయలో బీటా కెరొటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత విటమిన్ Aగా మారి కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంతో పాటు చర్మం, ఎముకల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. గుండెజబ్బులు, కొన్ని క్యాన్సర్ల నుంచి కూడా రక్షణ కల్పించే గుణాలు దీనిలో ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
వివరాలు
క్యాన్సర్ నిరోధక గుణాలు
గుమ్మడికాయ గింజలు పోషకాల నిల్వగా ఉంటాయి. వీటిలో జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం వంటి మూలకాలు సమృద్ధిగా ఉండి డయాబెటిస్, ఆర్థరైటిస్, వాపు సమస్యలు, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు నియంత్రణ గుమ్మడిలో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీని వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. ఎముకల దృఢత్వం కూడా మెరుగవుతుంది.
వివరాలు
బరువు నియంత్రణ
గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉండి, కేలరీలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల తక్కువగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. డైట్‌లో ఉన్నవారికి ఇది మంచి ఆహార ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.