NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Motivational: ఈ ఐదు రకాల మనుషులకు సలహాలు ఇవ్వొద్దు.. ఇస్తే మీరు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Motivational: ఈ ఐదు రకాల మనుషులకు సలహాలు ఇవ్వొద్దు.. ఇస్తే మీరు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది!
    ఇస్తే మీరు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది!

    Motivational: ఈ ఐదు రకాల మనుషులకు సలహాలు ఇవ్వొద్దు.. ఇస్తే మీరు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 05, 2025
    04:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మనం తరచూ ఒక మాట వింటుంటాం.."మంచి చేయకపోతే మనం ఎందుకు అని ?."

    కానీ జీవితంలో కొన్ని సందర్భాల్లో మంచి చేయాలని ఉద్దేశించినా దాని ఫలితాలు అంచనా వేయలేనివిగా మారిపోతాయి.

    మనం ఎవరికైనా సహాయం చేయాలనే దృక్పథంతో ముందుకెళ్లినా, వారి సమస్యలను తగ్గించాలన్న మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ,కొన్ని సందర్భాల్లో అది మనకే బాధలను మిగులుస్తుంది.

    ముఖ్యంగా అవసరం లేనప్పుడు లేదా ఎదుటి వారు అడగకుండా ఇచ్చే సలహాలు చాలా రిస్క్‌తో కూడుకున్నవి.

    సలహా ఇవ్వాలంటే ముందు ఎదుటివారు నిజంగా కావాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని గమనించాలి.

    అందుకు వారు అడిగినపుడే సలహా ఇవ్వడం ఉత్తమం.ముఖ్యంగా ఈ ఐదు రకాల వ్యక్తులకు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సలహాలు ఇవ్వకండి.ఎందుకంటే అది మీకే ముప్పుగా మారవచ్చు.

    వివరాలు 

    ఎవరికి సలహాలు ఇవ్వకూడదు? 

    1. మూర్ఖులకు సలహాలివ్వడం మానుకోండి

    తెలివితక్కువవారికి సలహాలు ఇవ్వడం అనవసరమైన ప్రయత్నం. ఎందుకంటే వారు మీ మాటల వెనుక ఉన్న లోతునీ, ఉద్దేశాన్ని,ప్రయోజనాన్ని అర్థం చేసుకోలేరు. అవగాహన లేకుండా మాట్లాడుతూ చివరకు మీకే సమస్యలు తలెత్తేలా చేస్తారు.వారు తీసుకునే నిర్ణయాలు అర్థరహితంగా ఉండటంతోపాటు, చివరికి మీరు చెప్పిన మాటలతోనే ఇబ్బందుల్లో పడతారు. అందుకే మూర్ఖులకు సలహా ఇవ్వకపోవడం బెటర్. 2. భార్య-భర్తల విషయంలో సలహాలివ్వకండి

    జీవితంలో భార్యాభర్తల మధ్య జరిగే తగాదాలు సాధారణం.వారు ఎంత గొడవపడ్డా,చివరికి కలిసిపోతారు. అలాంటి సంభంధాల్లో మీరు మధ్యలోకి వచ్చి సలహాలు ఇస్తే, వారు ఒక్కసారిగా మీపైనే కోపం చూపే ప్రమాదం ఉంది. ఆపై వారు మీ మాటలను నమ్మక పోవడమే కాదు, దూరంగా ఉండడం మొదలుపెడతారు.

    వివరాలు 

    ఎవరికి సలహాలు ఇవ్వకూడదు? 

    వారి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం వల్ల మంచి కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది.

    3. అహంకారులకు అసలే ఇవ్వకండి

    అహంకారంతో నిండిన వ్యక్తులు ఇతరుల అభిప్రాయాలను పెద్దగా పరిగణించరు. వారి దృష్టిలో తామే తెలివైనవారు, తామే గొప్పవారు. అలాంటి వారు ఎవరైనా సలహా ఇస్తే, దాన్ని పట్టించుకోరు. దానికి భిన్నంగా, వారే సలహా ఇచ్చే స్థాయిలో ఉన్నారని భావిస్తారు. అహంకారులు మీ సలహాలను హేళన చేస్తారు, తక్కువ చేస్తారు. అందుకే వారితో చర్చలో పడకుండా, సైలెంట్‌గా ఉండటం మంచిది.

    వివరాలు 

    ఎవరికి సలహాలు ఇవ్వకూడదు? 

    4. లోభులకు మంచి చెప్పకండి

    చాలామంది లోభులు తమకు లాభం లేనిదే చేయరు. మీరు ఇచ్చే సలహా కూడా వారికే ఉపయోగపడాలనిపిస్తే తప్ప, వినరు. మిగతా విషయాల్లో వారు మీరు చెప్పినదాన్ని పట్టించుకోరు. అంతేకాదు, ఒకవేళ మీ సలహాతో వారు లాభపడితే, వెంటనే మిమ్మల్ని మర్చిపోతారు కూడా. వారి వద్ద సమర్థవంతంగా సలహాలు ఇచ్చినా, దానికి విలువ ఉండదు. కాబట్టి, లోభులకు జాగ్రత్తగా ఉండండి.

    5. చెడు అలవాట్లున్న వారికి

    మద్యపానం, ధూమపానం, అసభ్యకరమైన ప్రవర్తన వంటి చెడు అలవాట్లు ఉన్నవారు, ఇతరుల సలహాలను స్వీకరించరు. మీరు ఎంత మంచిగా చెప్పినా, వారు దాన్ని తక్కువ చేస్తారు లేదా వ్యంగ్యంగా మార్చి మిమ్మల్ని అవమానించే అవకాశముంది.

    వివరాలు 

    చెడు అలవాట్లున్న వారికి దూరంగా ఉండటమే ఉత్తమం

    పైగా, వారు చెడ్డ పరిసరాల్లో ఉండడం వల్ల మీపై ప్రభావం పడే ప్రమాదం కూడా ఉంది. అలాంటి వారిని మార్చేందుకు ప్రయత్నించకండి - దూరంగా ఉండటమే ఉత్తమం.

    గమనిక: ఈ సమాచారం నిపుణుల విశ్లేషణల ఆధారంగా రూపొందించబడింది. జీవితం లో ఎదురయ్యే అనుభవాల నుంచి సేకరించిన సూచనలే ఇది. మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందు, ఆ అంశానికి సంబంధించిన నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేరణ

    తాజా

    Arrest Kohli: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న'అరెస్ట్ కోహ్లీ'.. ఎందుకంటే..? విరాట్ కోహ్లీ
    Harihara Veeramallu: మరోసారి వాయిదా పడిన 'హరిహర వీరమల్లు' .. టీమ్ ప్రకటన హరిహర వీరమల్లు
    PhonePe: ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల కోసం యూపీఐ ఆధారిత చెల్లింపు సేవల్ని ప్రవేశపెట్టిన ఫోన్‌పే ఫోన్‌ పే
    Telangana: ఎఫ్‌ఎల్‌ఎన్,లిప్‌ కార్యక్రమాల అమలుకు ఐదు రకాల బృందాలు.. పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు తెలంగాణ

    ప్రేరణ

    ప్రేరణ: ఈ ప్రపంచాన్ని మార్చేది నీ చేతలే, నీ అభిప్రాయాలు కాదు  లైఫ్-స్టైల్
    ప్రేరణ: గమ్యం వైపు వెళ్ళే దారి ఎంత ఉత్సాహంగా ఉంటే అంత తొందరగా గమ్యాన్ని చేరుకుంటావ్  లైఫ్-స్టైల్
    ప్రేరణ: నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటో తెలుసా?  జీవితం
    ప్రేరణ: నువ్వు గొప్ప స్నేహితుడైతేనే నీకు గొప్ప స్నేహితులు దొరుకుతారు  జీవితం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025