LOADING...
Promise Day : మాటలతో హృదయాన్ని గెలుచుకునే రోజు ఇదే.. ప్రామిస్ డే.. మీ కోసమే బెస్ట్ కోట్స్!
మాటలతో హృదయాన్ని గెలుచుకునే రోజు ఇదే.. ప్రామిస్ డే.. మీ కోసమే బెస్ట్ కోట్స్!

Promise Day : మాటలతో హృదయాన్ని గెలుచుకునే రోజు ఇదే.. ప్రామిస్ డే.. మీ కోసమే బెస్ట్ కోట్స్!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాలెంటైన్స్ వీక్‌లో ప్రతి రోజుకూ ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఆ క్రమంలో ఫిబ్రవరి 11న జరుపుకునే ప్రామిస్ డే ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. ఈ రోజున ప్రేమికులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుతూ, తమ బంధాన్ని మరింత బలపరిచేలా వాగ్దానాలు చేసుకుంటారు. అయితే చాలామందికి తమ ప్రేమికుడికి లేదా ప్రేమికురాలికి ఎలాంటి మాటల్లో వాగ్దానం చేయాలా అనే సందేహం కలుగుతుంటుంది. అలాంటి వారి కోసమే ఈ సమాచారం.

వివరాలు 

వాగ్దానాలు  

ప్రామిస్ డే రోజున సరైన మాటలతో ఇచ్చే హామీ మీ బంధాన్ని మరింత లోతుగా, గట్టిగా మారుస్తుంది. భావోద్వేగంతో కూడిన మాటలు ప్రేమలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ సందర్భంగా మీ ప్రియురాలికి లేదా ప్రియుడికి ఈ తరహా మాటలతో ప్రామిస్ చేయవచ్చు. "ప్రియతమా... నా ప్రేమ పూర్తిగా నీకే అంకితం. మనిద్దరి మధ్య మొదలైన ఈ ప్రయాణం నా చివరి శ్వాస వరకు అలాగే కొనసాగుతుంది. నా ప్రాణం నువ్వే. హ్యాపీ ప్రామిస్ డే." "నీ మాటల మాధుర్యంతో నా హృదయాన్ని దోచుకున్నావు. ఎన్ని జన్మలు వచ్చినా నిన్ను మరిచిపోను. ఈ జన్మలో నా గమ్యం నువ్వే. హ్యాపీ ప్రామిస్ డే."

వివరాలు 

వాగ్దానాలు

"నిన్ను మొదటిసారి చూసిన క్షణంలోనే నువ్వే నా కలల రాణి అని నిర్ణయించుకున్నాను. ఏ పరిస్థితిలోనూ నిన్ను వదలను. ఎప్పటికీ నీతోనే ఉంటాను. హ్యాపీ ప్రామిస్ డే." "నేను సంపూర్ణుడిని కాకపోవచ్చు, తప్పులు చేయవచ్చు, కొన్నిసార్లు మన మధ్య వాదనలు రావచ్చు. అయినా నా ప్రేమ మాత్రం నిస్సందేహంగా నిజమైనది. నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని ఈ రోజున మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను." ఇలాంటి హృదయాన్ని తాకే మాటలతో ప్రామిస్ చేస్తే, మీ ప్రేమ బంధం మరింత బలంగా మారడం ఖాయం.

Advertisement