LOADING...
Women's Day 2026: శారీరకంగా కాదు.. మానసికంగా మహిళలు బలంగా మారాలంటే ఈ అలవాట్లు అవసరం
శారీరకంగా కాదు.. మానసికంగా మహిళలు బలంగా మారాలంటే ఈ అలవాట్లు అవసరం

Women's Day 2026: శారీరకంగా కాదు.. మానసికంగా మహిళలు బలంగా మారాలంటే ఈ అలవాట్లు అవసరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాలా మందిలో మహిళలు బలహీనులు అనే భావన ఉంటుంది. కానీ ఒక మహిళ బలం కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఉండాలి. మానసిక స్థైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగగలుగుతారు. మరి మహిళలు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలంటే అలవరుచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇవి.

Details

1. భావోద్వేగాలను నియంత్రించాలి

మానసికంగా బలంగా ఉండాలంటే మహిళలు తమ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. కోపం, బాధ లేదా నిరాశ కలిగినప్పుడు వెంటనే స్పందించకుండా కాసేపు ఆలోచించడం మంచిది. ఎప్పుడు శాంతంగా ఉండాలో, ఎప్పుడు ధైర్యంగా సమాధానం ఇవ్వాలో తెలుసుకోవడం మానసిక బలానికి సూచిక. 2. మార్పును స్వాగతించాలి జీవితంలో వచ్చే మార్పులను చాలామంది అంగీకరించలేరు. కానీ మానసికంగా బలమైన మహిళలు ఎలాంటి మార్పు వచ్చినా దాన్ని స్వీకరిస్తారు. కొత్త పరిస్థితులను భయపడకుండా ఎదుర్కొని వాటిని అవకాశాలుగా మార్చుకుంటారు. ప్రతి సవాలును తమ ఎదుగుదలకు ఒక మెట్టుగా భావిస్తారు.

Details

3. అవసరమైనప్పుడు 'నో' చెప్పడం నేర్చుకోవాలి

అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో మనసుకు శాంతి కోల్పోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి తమ అభివృద్ధికి లేదా మానసిక ప్రశాంతతకు ఆటంకం కలిగించే విషయాలకు అపరాధ భావం లేకుండా ధైర్యంగా 'నో' చెప్పడం నేర్చుకోవాలి. 4. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకూడదు మానసికంగా బలమైన మహిళలు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు. పక్కవారి విజయం వారికి స్ఫూర్తిగా మారుతుంది. వారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి ముందుకు సాగుతారు.

Advertisement

Details

5. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి

ఏ పని విఫలమైనప్పుడు ఇతరులను నిందించడం కన్నా, తమ తప్పులను గుర్తించి వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. ఓటమిని అంతిమంగా భావించకుండా, భవిష్యత్తు విజయానికి దారితీసే ఒక అనుభవంగా స్వీకరించాలి. ఈ లక్షణాలను అలవరుచుకున్న మహిళలు కేవలం మానసికంగా బలంగా మారడమే కాకుండా, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలను కూడా పెంచుకుంటారు.

Advertisement