ట్రావెల్: ఇండియాలోని అత్యంత పరిశుభ్రమైన బీచ్ లను సందర్శించాలనుకుంటే ఇది తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
సముద్ర తీరాలను అందంగా పరిశుభ్రంగా ఉంచినందుకు బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అందిస్తారు. అలా మనదేశంలో బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అందుకున్న బీచ్ లు 12 ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
కాసర్ కోడ్ బీచ్ - కర్ణాటక:
చుట్టుపక్కల సరుగుడు చెట్లు, తెల్లని ఇసుకను పరుచుకుని ఈ తీరం అందంగా ఉంటుంది. 2020లో ఈ తీరానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చింది. సోలార్ పవర్ ప్లాంట్, గ్రే వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసినందుకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చింది.
రాధానగర్ బీచ్ - అండమాన్ నికోబార్
ఈ తీరం చుట్టుపక్కల కొబ్బరి చెట్లు, అవి దాటితే అడవి ప్రాంతం ఉంటాయి. భారతదేశంలోని అత్యంత సుందరమైన బీచుల్లో ఇదొకటి.
Details
బ్లూ ఫ్లాగ్ అందుకున్న తీర ప్రాంతాలు
గోల్డెన్ బీచ్ - ఒడిషా
పూరీ బీచ్ అని కూడా పిలుచుకునే ఈ బీచ్, ఆసియాలోనే బ్లూ ఫ్లాగ్ అందుకున్న మొదటి బీచ్ గా రికార్డు సృష్టించింది. కోణార్క్ సూర్యదేవాలయానికి దగ్గర్లో ఉండే ఈ బీచ్ కు, 2020లో సర్టిఫికేట్ వచ్చింది.
శివరాజ్ పూర్ బీచ్ - గుజరాత్
ద్వారకా నుండి 12కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంటుంది. ఈ తీరంలో బోటింగ్, స్కూబా డైవింగ్, డాల్ఫిన్లను చూడటం వంటివి చేయవచ్చు.
గోగ్లా బీచ్ - డయ్యూ
అరేబియా సముద్ర తీరమైన ఈ బీచ్, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. బంగారు వర్ణంలో ఉండే ఇసుక, నీలికాంతితో మెరిసే సముద్రపు నీరు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి.