LOADING...
Holi special Recipes: హోలీ స్పెషల్ స్వీట్లు: దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తీపి వంటలు!
హోలీ స్పెషల్ స్వీట్లు: దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తీపి వంటలు!

Holi special Recipes: హోలీ స్పెషల్ స్వీట్లు: దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తీపి వంటలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

హోలీ పండుగకు స్వీట్లు చేసుకోకపోతే పండుగ సరదా కొంత తగ్గుతుంది. అందుకే దేశం నలుమూలలా హోలీ రోజున తయారు చేసే ప్రత్యేక స్వీట్లు ఏమిటో చూద్దాం. కజ్జికాయలు: హోలీ రోజున కజ్జికాయలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంప్రదాయ భారతీయ తీపి వంటకం చిన్నవాళ్ల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టం. కజ్జికాయలు లేకుండా హోలీ పండుగ పూర్తి కాదని కూడా అంటారు. హోలీ సందర్భంగా కజ్జికాయలు తయారు చేసే ఆనవాయితీ మొదట బ్రజ్ ప్రాంతంలో ప్రారంభమైందని చెబుతారు. అప్పట్లో శ్రీకృష్ణుడి కోసం వీటిని ప్రత్యేకంగా సిద్ధం చేసేవారని కథనం. ఆ తర్వాత ఈ సంప్రదాయం దేశవ్యాప్తంగా వ్యాపించి, హోలీ నాడు కజ్జికాయలు తయారు చేయడం ఒక ఆనవాయితీగా మారింది.

వివరాలు 

మోతీచూర్ లడ్డూ

మోతీచూర్ లడ్డూలు భారతదేశం అంతటా విశేష ప్రాచుర్యం పొందిన తీపి వంటకం. ఇప్పుడవి పండుగలు, శుభకార్యాలు, వేడుకలలో తప్పనిసరిగా కనిపిస్తాయి. హోలీ రోజున అదృష్టం, శుభం, సంపదలకు ప్రతీకగా మోతీచూర్ లడ్డూలను అతిథులకు అందించడం ఆనవాయితీగా ఉంది.ఎంతో రుచికరమైన ఈ లడ్డూలు.. పండుగలో జోష్ నింపుతాయి. కోవా: పాలు,పంచదారతో తయారు చేసే కోవా కూడా పండుగలలో ముఖ్యమైన తీపి వంటకం.దీని రుచి, మృదుత్వం ప్రత్యేకంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. కోవాలో యాలకులు, పిస్తా,కుంకుమపువ్వు వంటి పదార్థాలు కలిపితే రుచి మరింత పెరుగుతుంది.ఈ కోవాను దూద్ పేడా అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం పేడాలకు అనేక రకాలు అందుబాటులో ఉన్నా, హోలీ రోజున వీటిని పంచుకోవడం ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుంది.

వివరాలు 

రసమలై

రసమలై అనేది బాదం, సోంపు గింజలు, పుచ్చకాయ గింజలు,గులాబీ రేకులు,నల్ల మిరియాలు, గసగసాలు,యాలకులు,కుంకుమపువ్వు, పాలు, చక్కెరతో తయారుచేసే ఒక భారతీయ శీతల పానీయం. దీన్ని ముఖ్యంగా మహాశివరాత్రి, హోలీ వంటి పండుగల సమయంలో తయారు చేస్తారు. అనేక నగరాల్లో హోలీ రోజున ప్రధాన పానీయంగా తండాయి కూడా తయారు చేసి సేవిస్తారు. భారతదేశంలో హోలీ పండుగను వివిధ రకాల వంటకాలతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బజ్జీలు, పకోడీలు, బోండాలు వంటి వంటకాలను వేడివేడిగా సిద్ధం చేసుకొని అందరూ కలిసి ఆస్వాదిస్తారు. ఏ తీపి వంటకం చేసినా సరే, కనీసం ఒకటి అయినా ఇంట్లో తయారు చేస్తే పండుగ సందడి మరింత పెరుగుతుంది. అప్పుడు మాత్రమే హోలీ ఆనందం పూర్తి స్థాయిలో అనుభూతి చెందగలుగుతాం.

Advertisement