
కన్యాకుమారి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి
ఈ వార్తాకథనం ఏంటి
ట్రావెలింగ్ చేయాలన్న ఇష్టంతో తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఆ ప్రాంతంలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించడం మర్చిపోకండి.
సముద్ర తీర ప్రాంతమైన కన్యాకుమారిలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కన్యాకుమారి గుడి:
ఈ ప్రాంతంలోని చెప్పుకోదగిన ఆలయాల్లో కన్యాకుమారి ఆలయం ఒకటి. దీన్ని అమ్మా భగవతి ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని పాండ్యులు నిర్మించారని ఆ తర్వాత నాయకులు దీనికి మరమ్మత్తులు చేశారని చెబుతారు.
ప్రపంచంలోని 108 శక్తి పీఠాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఉదయం 4:30నుండి మధ్యాహ్నం 12గంటల వరకు భక్తులకు ప్రవేశం ఉంటుంది. అలాగే సాయంత్రం 4:30నుండి 8:00వరకు ఆలయం తలుపులు తెరిచి ఉంటాయి.
Details
ఆకట్టుకునే వివేకానంద రాతిద్వీపం
పద్మనాభపురం భవంతి:
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కలప భవంతిగా పేరొందిన పద్మనాభపురం భవంతి, ట్రావెన్కోర్ పాలకులకు నివాసంగా ఉండేదని చెబుతారు.
ట్రావెన్కోర్ వంశానికి చెందిన ఇరవి వర్మ కులశేఖర పెరుమాళ్ అనే పాలకుడు 16వ శతాబ్దంలో ఈ భవంతిని నిర్మించారని చరిత్ర చెబుతోంది.
వివేకానంద రాతిద్వీపం:
కన్యాకుమారి వెళితే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో వివేకానంద రాతిద్వీపం కూడా ఒకటి. ఇది రాతితో కప్పబడి ఉన్న సముద్రంలోని ఒక చిన్న ద్వీపం.
స్వామి వివేకానంద ఈ ద్వీపానికి చేరుకుని ధ్యానం చేసేవారని చెబుతారు. ఈ ప్రదేశంలో వివేకానంద మండపం, శ్రీపాద మండపం కనిపిస్తాయి.
Details
వివేకానంద రాతి ద్వీపం పక్కనే 133 అడుగుల విగ్రహం
తిరువళ్ళువార్ విగ్రహం
స్వామి వివేకానంద రాతిద్వీపానికి పక్కనే 133అడుగుల తిరువళ్ళువార్ విగ్రహం ఉంటుంది. భారతదేశంలోని గొప్ప కవుల్లో తిరువళ్ళువార్ ఒకరు.
2000 జనవరి 1వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారతదేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో ఈ విగ్రహం కూడా ఒకటి.
రామ్సన్ చర్చ్:
మేరీమాతకు చెందిన ఈ చర్చి, కన్యాకుమారి తీర ప్రాంతంలో ఉంటుంది. గోతిక్ శిల్పకలతో చూడడానికి అందంగా నిర్మించారు. ఈ చర్చిలో అత్యంత అసాధారణంగా కనిపించే విషయం ఏమిటంటే, చీరలో మేరీమాత విగ్రహం దర్శనమిస్తుంది.