ట్రావెల్: వాటికన్ సిటీ నుండి గుర్తుగా ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు
వాటికన్ సిటీ... ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న దేశం ఇది. ఈ దేశం చుట్టూ ఇటలీ ఉంటుంది. అంటే ఇటలీ దేశం భూభాగం మధ్యలో ఈ దేశం ఉంటుందన్నమాట. ఇక్కడ క్రైస్తవులు ఎక్కువమంది ఉంటారు. ఈ ప్రాంతానికి పర్యటన కోసం వెళ్తే ఇంటికి గుర్తుగా ఎలాంటి వస్తువులు తీసుకురావాలో ఇప్పుడు తెలుసుకుందాం. పోప్ ఆభరణాలు ముందుగానే చెప్పినట్టు ఈ ప్రాంతంలో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. పోప్ లు ధరించిన ఆభరణాల స్ఫూర్తితో తయారయ్యే ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి. పవిత్ర జలం క్రిస్టియన్ల పవిత్ర దేశమైన వాటికన్ సిటీలో, పవిత్ర జలం సీసాలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ సీసాలను అక్కడివారు చాలా పవిత్రంగా భావిస్తారు. వీటిని మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు.
ఆసక్తి కలిగించే జపమాల
పాత గడియారాలు ఈ నగరంలో రకరకాల స్మారక చిహ్నాలు, పురాతన చర్చిలు మీకు దర్శనమిస్తాయి. అలాగే మార్కెట్లోకి వెళితే పాత గడియారాలు మీకు కనిపిస్తాయి. పాత వాటి పైన మీకు ఆసక్తి ఉంటే ఈ గడియారాలను ఇంటికి తెచ్చుకోండి. మార్బుల్ ట్యాబ్లెట్ టాబ్లెట్ ఆకారంలో ఉండే మార్బుల్స్ పైన బైబిల్ లోని కొటేషన్లను రాసి అమ్ముతుంటారు. మార్కెట్లోకి మీరు వెళ్ళినప్పుడు ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మీకు నచ్చిన కొటేషన్లు ఉన్న మార్బుల్ ట్యాబ్లెట్లను ఇంటికి తెచ్చుకోండి. జపమాల పూసలతో చేసిన జపమాలలు వాటికన్ సిటీ మార్కెట్లో విరివిగా కనిపిస్తాయి. బైబిల్ లో వాక్యాలు చదివేటప్పుడు ఈ జపమాలను ఉపయోగిస్తారు.