Page Loader
Turmeric powder: పసుపు పొడి ట్రెండ్‌.. ఇంటిని కాకుండా చర్మాన్నీ మెరిసేలా చేసుకోండి!
పసుపు పొడి ట్రెండ్‌.. ఇంటిని కాకుండా చర్మాన్నీ మెరిసేలా చేసుకోండి!

Turmeric powder: పసుపు పొడి ట్రెండ్‌.. ఇంటిని కాకుండా చర్మాన్నీ మెరిసేలా చేసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లలో పసుపుతో చేసిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. సెల్‌ఫోన్‌ టార్చ్‌ ఆన్‌ చేసి, గాజు గ్లాస్‌ పెట్టి, అందులో పసుపు పొడిని పోయాలి. గది అంతా చీకటిగా ఉన్నప్పుడు, గ్లాస్‌ కింద ఫోన్‌ ఫ్లాష్‌ లైట్‌తో పసుపు నీటిలో కరిగితే, పసుపురంగు మెరుపుతో గది మొత్తం వెలుగుతో నిండినట్టు అనిపిస్తుంది.

Details

పసుపుతో చర్మానికి కూడా మెరుపే! 

కేవలం వీడియోల్లోనే కాకుండా, పసుపుతో నిజ జీవితంలోనూ చర్మానికి అద్భుతమెరుపును అందించవచ్చు. పసుపును నేరుగా కాకుండా పచ్చి పసుపును ప్రత్యేకంగా ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. పసుపులో ఉండే 'కర్కుమిన్' శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది. చర్మం ఎర్రబడడం, వాపు, చికాకు వంటి సమస్యలను తగ్గించడం లో పసుపు ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Details

మొటిమలు, అలెర్జీలు, మంటకు పసుపుతో పరిష్కారం 

మొటిమలు, వడదెబ్బ వల్ల చర్మం పాడవడాన్ని, అలెర్జీల వల్ల వచ్చే మంటలను పసుపు నివారిస్తుంది. పసుపులో ఉన్న నేచురల్‌ యాంటీసెప్టిక్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. చిన్న గాయాలు, కోతలను మాన్పడంలో కూడా పసుపును విరివిగా ఉపయోగిస్తారు. కాంతిమయ చర్మానికి పసుపే సరిపోతుంది! పసుపును క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మకాంతిని పెంపొందించుకోవచ్చు. డార్క్‌ స్పాట్స్‌ తొలగించడం, పిగ్మెంటేషన్‌ తగ్గించడం వంటి పనుల్లో పసుపు మంచి రిజల్ట్‌ ఇస్తుంది. మెలటోనిన్‌ ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా చర్మం ప్రకాశవంతం అవుతుంది.

Details

జిడ్డు చర్మం, మొటిమలకు పసుపే శరణ్యం! 

జిడ్డు చర్మం ఉన్నవారికి, మొటిమల సమస్యలతో బాధపడేవారికి పసుపు ఎంతో మేలు చేస్తుంది. చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా, అధిక సెబమ్‌ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. దీంతో చర్మం కాంతిమయంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది.