Loading...
Ugadi 2026: ఈ సంవత్సరం పెళ్లిళ్లు, గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలివే
ఈ సంవత్సరం పెళ్లిళ్లు, గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలివే

Ugadi 2026: ఈ సంవత్సరం పెళ్లిళ్లు, గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలివే

వ్రాసిన వారు Moogati Shabari
Mar 19, 2026
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు ప్రజల కొత్త సంవత్సరం ఉగాది పండుగగా ప్రసిద్ధి పొందింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఈ పండుగను ఎంతో ఆనందంగా, వైభవంగా జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో ఉగాది మార్చి 19వ తేదీ గురువారం రోజున, శ్రీ పరాభవ నామ సంవత్సర ఆరంభంగా వచ్చింది. ఈ పండుగ ప్రకృతిలో వచ్చే మార్పులను, కొత్త ఆశలను సూచించే ప్రత్యేక సందర్భం. చైత్ర మాసంతో కొత్త సంవత్సర చక్రం ప్రారంభమై, ఫాల్గుణ మాసంతో ముగుస్తూ మొత్తం పన్నెండు నెలలు కొనసాగుతాయి. చాంద్రమానం ప్రకారం చైత్రమాసంలో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఇది సమశీతోష్ణ వాతావరణంతో ప్రపంచం మొత్తం ఉల్లాసంగా మారే కాలం. ఈ సమయంలో ప్రకృతి మాత్రమే కాదు.. మనసు, బుద్ధి కూడా వికసిస్తాయి.

వివరాలు

ముహూర్తాలు ఎప్పుడంటే..

ఆయుర్వేదం ప్రకారం చిత్త నక్షత్ర ప్రభావంతో మన శరీరానికి చైతన్యం పెరుగుతుంది.

సంవత్సరంలో అత్యంత ఉత్సాహాన్ని కలిగించే మాసం చైత్రమాసమే.

అందుకే ఉగాది రోజున ఆరు రుచుల పచ్చడి ద్వారా జీవన అనుభవాలన్నిటినీ స్వాగతిస్తారు.

ఇక శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వివాహాలు, ఇతర శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలను పరిశీలిద్దాం.

ఈ సంవత్సరంలో వివాహాలు, గృహారంభం (భూమి పూజ), గృహప్రవేశం, ఉపనయనం, అన్నప్రాశనం, వ్యాపార ప్రారంభం వంటి కార్యక్రమాలకు చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు అనేక శుభముహూర్తాలు ఉన్నాయి.

వివరాలు

పంచాంగ వివరాల ప్రకారం..

చైత్ర మాసం:

మార్చి 27 - వ్యాపార ప్రారంభానికి అనుకూలం

మార్చి 28 - ఉపనయనం, వ్యాపారం, గృహారంభం (భూమి పూజ)కు శుభదినం

వైశాఖ మాసం:

ఏప్రిల్ 26 - వివాహం, గృహప్రవేశానికి అత్యుత్తమ ముహూర్తం

ఏప్రిల్ 29 - వివాహానికి అనుకూలమైన రోజు

మే నెలలో: మే 1 - వివాహం, గృహారంభం

మే 3 - వ్యాపారం, గృహప్రవేశం

మే 6 నుండి మే 11 వరకు - అనేక వివాహ ముహూర్తాలు ఉన్నాయి.

జ్యేష్ఠ మాసం:

జూన్ 17 నుండి జూలై 9 వరకు - వివాహాలు, గృహప్రవేశాలకు అద్భుతమైన ముహూర్తాలు

ADVERTISEMENT

వివరాలు

ముఖ్యమైన తేదీలివే..

శ్రావణ మాసం:

ఆగస్టు 15, 16, 20, 22 - వివాహాలకు శుభముహూర్తాలు

కార్తిక మాసం:

నవంబర్ 12 నుండి నవంబర్ 22 వరకు - అనేక వివాహ ముహూర్తాలు లభ్యం.

మాఘ మాసం (2027):

ఫిబ్రవరి 7 నుండి ఫిబ్రవరి 27 వరకు - వివాహాలకు అనుకూలమైన కాలం

ఫాల్గుణ మాసం (2027):

మార్చి 10 నుండి ఏప్రిల్ 2 వరకు - వివాహాలు, గృహప్రవేశం, వ్యాపార ప్రారంభాలకు అత్యంత శుభప్రదమైన సమయం.

ADVERTISEMENT