LOADING...
Ugadi: 2026 ఉగాది ఏ రోజు వస్తుంది? ఏ సమయానికి ముగుస్తుంది?
2026 ఉగాది ఏ రోజు వస్తుంది? ఏ సమయానికి ముగుస్తుంది?

Ugadi: 2026 ఉగాది ఏ రోజు వస్తుంది? ఏ సమయానికి ముగుస్తుంది?

వ్రాసిన వారు Moogati Shabari
Mar 12, 2026
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి. ఈ పండుగ అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. తెలుగు ప్రజలు ఈ రోజును ఎంతో ఆనందంతో కొత్త సంవత్సర ప్రారంభంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి తిథి రోజున ఉగాది పండుగను నిర్వహిస్తారు. ప్రతి ఏడాది కొత్త నామ సంవత్సరంతో ఉగాది ప్రారంభమవుతుంది. 2026 సంవత్సరంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు సంప్రదాయంలో ఉగాది కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలకు నాంది పలికే ప్రత్యేకమైన పండుగగా భావిస్తారు.

వివరాలు

ఉగాది మార్చి 19 లేదా 20వ తేదా?

2026 సంవత్సరంలో ఉగాది పండుగ మార్చి 19, గురువారం నాడు జరగనుంది. పాడ్యమి తిథి మార్చి 19 ఉదయం 6:53 గంటలకు ప్రారంభమై, మార్చి 20 ఉదయం 4:52 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున చాలామంది పంచాంగ శ్రవణం విని తమ రాశి ఫలితాలను తెలుసుకుంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఆదాయం, ఖర్చులు, అదృష్టం ఎలా ఉంటుందనే విషయాలను పంచాంగం ఆధారంగా తెలుసుకునే సంప్రదాయం ఉంది. ఉగాది రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవునికి పూజలు చేస్తారు. అనంతరం ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు.

వివరాలు

ఉగాది అంటే అర్థం ఏంటి?

ఇంట్లో ప్రత్యేకంగా తీపి, చేదు, ఉప్పు, కారం, పులుపు, వగరు వంటి ఆరు రుచులతో ఉగాది పచ్చడి తయారు చేసి కుటుంబ సభ్యులు అందరూ తీసుకుంటారు. తరువాత పంచాంగ శ్రవణం వినడం ఆనవాయితీ. ఉగాది అనే పదం "యుగాది" అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. "యుగం + ఆది" అంటే యుగానికి ఆరంభం అనే అర్థం. కాలక్రమేణా అది ఉగాది అనే పదంగా మారింది. సృష్టి ప్రారంభమైన రోజు అనే భావనతో ఈ పండుగను జరుపుకుంటారని పెద్దలు చెబుతుంటారు.

Advertisement

వివరాలు

పండుగ రోజు ఇలా చేస్తే శుభాలే

ఉగాది పండుగ ప్రకృతితో కూడా సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. ఇది వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో వాతావరణ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ఆరు రుచులతో చేసే ఉగాది పచ్చడి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని పెద్దలు చెబుతారు. వాతావరణ మార్పులతో వచ్చే కొన్ని వ్యాధులను దూరం చేయడంలో ఇది సహాయపడుతుందని విశ్వసిస్తారు. ఉగాది రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి మామిడి ఆకులతో తొరణాలు కడతారు. ఆ తరువాత కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజలు చేస్తారు. చాలా మంది ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Advertisement