
వైద్య శాస్త్రంలోనే మిరాకిల్.. మహిళకు రెండు గర్భసంచులు.. రెండింట్లోనూ ఒకేసారి గర్భం
ఈ వార్తాకథనం ఏంటి
వైద్య శాస్త్రంలోనే అరుదైన సంఘటన అమెరికాలో జరిగింది. ఒకే కాన్పులో నలుగురు, ఐదుగురు, ఏకంగా తొమ్మిమంది పిల్లలు జన్మించిన వార్తలను మనం విని ఉన్నాం.
వీటి కంటే ఆశర్యపరిచే సంఘటన ఒకటి అమెరికాలో జరిగింది. అమెరికాలోని అలాబామాకు చెందిన కెల్సీ హాట్చర్ అనే మహిళ రెండు గర్బాశయాలతో 32ఏళ్ల క్రితం జన్మించింది.
ఇలా పుట్టడమే చాలా అరుదు అంటే, ఇప్పుడు ఆ మహిళ రెండు గర్బాశయాల్లో ఒకేసారి గర్భం దాల్చడం విశేషం.
ఇలా జరగడం వైద్యశాస్త్రంలో చాలా అరుదు అని వైద్యులు చెబుతున్నారు. మిలియన్ల మంది ఒకరి మాత్రమే ఇలా జరుగుతుందని అంటున్నారు.
అమెరికా
రెండు డెలివరీలు ఒకసారి జరుగుతాయా?
కెల్సీ హాట్చర్ 17 ఏళ్ల వయసులో ఆమెకు రెండు గర్భాశయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆమె 'యూటెరస్ డిడెల్ఫిస్' అనే అరుదైన వ్యాధితో పుట్టింది. ఈ వ్యాధి ప్రపంచంలోని 0.3% మంది మహిళల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి వల్లే ఆమెకు రెండు గర్భాశయాలు ఏర్పడినట్లు వైద్యులు చెబుతున్నారు.
మేలో తాను రెండు గర్భాశయాల్లో గర్భందాల్చినట్లు కెల్సీ తెలుసుకున్నారు. ఆమె అల్ట్రాసౌండ్ కోసం వెళ్ళినప్పుడు ఈ విషయం తెలిసింది.
కెల్సీ కడుపులో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లు.. వారు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
ఈ క్రిస్మస్ సమయంలో ఆమె డెలివరీ తేదీని డాక్టర్లు ఫిక్స్ చేశారు. అయితే, రెండు డెలివరీలు ఏకకాలంలో జరుగుతాయా? లేక వేర్వేరు సమయాల్లో జరుగుతాయా అనేది ఇంకా డాక్టర్లు చెప్పలేదు.