LOADING...
Valentine week 2026: 2026 వాలంటైన్స్ వీక్ గైడ్:ఫిబ్రవరి 7నుంచి 14వరకు మీ లవర్‌కు ఏ రోజు ఏ గిఫ్ట్‌ ఇవ్వాలి?  
మీ లవర్‌కు ఏ రోజు ఏ గిఫ్ట్‌ ఇవ్వాలి?

Valentine week 2026: 2026 వాలంటైన్స్ వీక్ గైడ్:ఫిబ్రవరి 7నుంచి 14వరకు మీ లవర్‌కు ఏ రోజు ఏ గిఫ్ట్‌ ఇవ్వాలి?  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026 ఫిబ్రవరి 14 అతి త్వరలో రానుంది. ప్రేమికులు తమ ప్రత్యేక రోజుకు సిద్ధం అవుతున్నారు. వారం ముందే ప్రతి ఒక్కరు తమ ఇష్టమైన వ్యక్తికి ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్య పరుస్తారు. వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. అయితే ఏ రోజు ఏ గిఫ్ట్ ఇవ్వాలి? దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.. వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. వాలంటైన్స్ వీక్‌ ప్రతిరోజు ఒక్కో గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకుంటారు. దీనికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది.

వివరాలు 

ఫిబ్రవరి 7 - రోజ్ డే

వాలంటైన్స్ వీక్ ప్రారంభ రోజు రోజ్ డే. ఈ రోజు స్నేహితులు, ప్రేమికులు తమ ప్రియమైన వారికి ఎరుపు రోజ్ ఇవ్వడం సాధారణం. అయితే, రెడ్ రోజ్ మాత్రమే కాకుండా, ప్రియుడు/ప్రియురాలికి ఇష్టమైన రంగులోని రోజ్ కూడా ఇవ్వవచ్చు. ఫిబ్రవరి 8 - ప్రపోజ్ డే ప్రపోజ్ డే అనేది ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేసే రోజు. చాలా మంది ఈ రోజును ఉపయోగించి తమ ఇష్టమైన వ్యక్తికి ప్రపోజ్ చేయాలని అనుకుంటారు. అప్పుడు రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అని నమ్ముతారు.

వివరాలు 

ఫిబ్రవరి 10 - టెడ్డి డే

టెడ్డి డేలో యువత ఎక్కువగా తమ ప్రేమికులకు టెడ్డి బేర్ గిఫ్ట్ చేస్తారు. ఇది ఒకరికి ఒకరు ఉన్న సాన్నిహిత్యాన్ని, ప్రేమను సూచిస్తుంది. ఫిబ్రవరి 11 - ప్రామిస్ డే ప్రామిస్ డేలో ఒకరికి ఒకరు వాగ్దానం ఇచ్చి బలమైన అనుబంధాన్ని చూపుతారు. ప్రేమికుల మధ్య ఉన్న విశ్వాసాన్ని, అంకితభావాన్ని ఈ రోజు మరింత పెంపొందించవచ్చు. ఫిబ్రవరి 12 - హగ్ డే హగ్ డేలో ప్రేమికులు ఒకరినొకరు ఆలింగనం చేసుకునే రోజు. ఇది ప్రేమను వ్యక్తం చేసే అత్యంత శక్తివంతమైన విధానం. అలాగే, ఒకరినొకరు ఎమోషనల్ సపోర్ట్ అందించడంలో కూడా సహాయపడుతుంది.

Advertisement

వివరాలు 

ఫిబ్రవరి 13 - కిస్ డే

కిస్ డేలో తమ ప్రియమైన వ్యక్తికి ఒక ముద్దు పెట్టి ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇది బంధాన్ని బలోపేతం చేసే మాధ్యమమే కాక, వారి ప్రేమను కూడా స్పష్టంగా చూపిస్తుంది. ఫిబ్రవరి 14 - వాలంటైన్స్ డే ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్స్ డే. ఈ రోజు ప్రత్యేకంగా ప్రియమైన వారికి గిఫ్ట్స్ ఇవ్వడం, డేట్ కి వెళ్ళడం, చేతితో రాసిన నోట్లు అందించడం వంటి చర్యలు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఈ రోజును అత్యంత ముఖ్యమైన రోజు గా జరుపుకుంటారు. ఇది సంబంధాలను మరింత బలోపేతం చేసి, సంతోషకరమైన స్మృతులను సృష్టిస్తుంది.

Advertisement