వినాయక చవితి: గణేషుడికి ఇష్టమైన కుడుముల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
వినాయక చవితి రోజున లంబోదరుడికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఈ నైవేద్యాలలో రకరకాల స్వీట్లు, ఉండ్రాళ్ళు, కుడుములు ఉంటాయి. అయితే వినాయకుడికి ఇష్టమైన ఈ ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం కుడుముల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. కుడుములను, మినప్పప్పు, శనగపిండి, బియ్యపు పిండి, బెల్లం, కొబ్బరితో తయారు చేస్తారు. కొందరు రాగిపిండిని కూడా ఉపయోగిస్తారు. బీపీని నియంత్రించే కుడుములు: కుడుములలో కొబ్బరిని ఉపయోగిస్తారు కాబట్టి దీనివల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. బీపీ కంట్రోల్ లో ఉంటే గుండె సురక్షితంగా ఉంటుంది. చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది: కుడుముల్లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. చక్కెర వ్యాధితో బాధపడేవారు కుడుములను తీసుకోవచ్చు.
ఎముకల బలాన్ని పెంచే కుడుములు
కుడుముల తయారీలో వాడే బెల్లం, కొబ్బరిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రాగిపిండి, మిల్లెట్స్ తో తయారు చేసే కుడుములలో పీచు పదార్థం(ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణ సంబంధ సమస్యలు, మలబద్దకం సమస్యలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తిని పెంచే కుడుములు: బెల్లంలో శాచురేటెడ్ కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కుడుములు: కుడుముల్లోని పదార్థాల్లో మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. ఐరన్ కారణంగా రక్తహీనత ఏర్పడదు. శరీరానికి పోషకాలను అందించడానికి మెగ్నీషియం ఉపయోగపడుతుంది.