తదుపరి వార్తా కథనం

వైరల్ వీడియో: తండ్రి గొరిల్లాను మొదటిసారి కలుసుకున్న పిల్ల గొరిల్లా ఆత్మీయ పలకరింపు
వ్రాసిన వారు
Sriram Pranateja
May 09, 2023
03:26 pm
ఈ వార్తాకథనం ఏంటి
అడవిలోని జంతువులు, వాటి పిల్లల పట్ల చూపించే ప్రేమ అబ్బురంగా ఉంటుంది. అడవి జంతువుల మధ్య ప్రేమను చూపించే వీడియోలు, ఫోటోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో దర్శనమిస్తుంటాయి.
తాజాగా భారత అటవీ శాఖ అధికారి సుశాంత నందా, ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలో తండ్రి గొరిల్లాను ఆత్మీయంగా పలకరిస్తున్న పిల్ల గొరిల్లా ఉన్నాయి.
మొదటిసారి తండ్రిని కలిసిన పిల్ల గొరిల్లా, ఆత్మీయంగా పలకరిస్తూ తన స్పర్శతో ప్రేమను తెలియజేసింది. చూడముచ్చటగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
13సెకన్ల వీడియోలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే ప్రేమ ఎంతో హృద్యంగా కనబడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న గొరిల్లా వీడియో
Baby Gorilla meets the Father for the first time💕 pic.twitter.com/bLOf0892jE
— Susanta Nanda (@susantananda3) May 7, 2023
మీరు పూర్తి చేశారు