LOADING...
Business Tips: వ్యాపారం చేయాలని ఉందా… పార్క్‌లో వాకింగ్ చేస్తూనే స్టార్టప్ ఐడియాలు పంచుకోండి!
వ్యాపారం చేయాలని ఉందా… పార్క్‌లో వాకింగ్ చేస్తూనే స్టార్టప్ ఐడియాలు పంచుకోండి!

Business Tips: వ్యాపారం చేయాలని ఉందా… పార్క్‌లో వాకింగ్ చేస్తూనే స్టార్టప్ ఐడియాలు పంచుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2026
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

'మంచి వ్యాపార ఆలోచన ఉంది... కానీ దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి?' 'ఇప్పటికే చిన్న స్థాయిలో బిజినెస్ నడుస్తోంది... ఇంకాస్త ఇన్వెస్టర్లు కావాలి!' 'ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం ఏదైనా స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాలనుంది...' ఇలాంటి ఆలోచనలు ఉన్న వారందరికీ ఇప్పుడు 'బిజినెస్ మీట్ వాక్స్' ఒక వేదికగా మారుతున్నాయి. మరి ఈ 'వాక్స్' అంటే ఏమిటి?

Details

పార్కులే స్టార్టప్ వేదికలు!

రాయదుర్గంలోని బొటానికల్ గార్డెన్‌కు ప్రతిరోజూ ఎంతోమంది వాకింగ్ కోసం వస్తుంటారు. అయితే, వారాంతాల్లో అక్కడ ఓ ప్రత్యేక దృశ్యం కనిపిస్తోంది. ఒకేచోట చేరిన కొందరు ఔత్సాహికులు తమ స్టార్టప్ ఆలోచనలను పంచుకుంటూ, వ్యాపార మెలకువలు తెలుసుకుంటూ, నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటున్నారు. బిజినెస్ రంగంలో జరుగుతున్న తాజా మార్పులపై చర్చలు సాగిస్తున్నారు. ఇదే తరహా వాతావరణం జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో కూడా ప్రతి శని, ఆదివారాల్లో కనిపిస్తోంది. ఈ 'బిజినెస్ మీట్ వాక్స్'లో స్టార్టప్ ఆలోచన ఉన్నవాళ్లే కాదు... ఇప్పటికే వ్యాపారాల్లో విజయాలు సాధించిన వారు, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు, బ్యాంకులు, సాఫ్ట్‌వేర్ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు.

Details

ఈ ఆలోచన ఎలా మొదలైంది?

'టీజీ10ఎక్స్' పేరుతో ఈ వాక్స్‌ను ప్రారంభించిన 'మేరా ఈవెంట్స్' అధినేత చెన్నప్పనాయుడు మాట్లాడుతూ... "స్టార్టప్‌ల కోసం నెట్‌వర్కింగ్ సంస్థలు కొన్ని ఉన్నప్పటికీ, వాటిలో చేరాలంటే రిజిస్ట్రేషన్లు, నియమ నిబంధనలు ఉంటాయి. చాలామందికి వాటి గురించి తెలియదు. అందుకే సరదాగా నడుస్తూ, ఆలోచనలు పంచుకునేలా పార్కుల్ని వేదికలుగా మార్చితే బాగుంటుందని అనిపించింది. అలా బొటానికల్ గార్డెన్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. సోషల్ మీడియా ద్వారా ప్రచారం కావడంతో ఇప్పుడు వారాంతాల్లో వచ్చే వారి సంఖ్య రెండు నుంచి మూడు వందలకు చేరింది. వచ్చిన వారి వివరాలను రిజిస్టర్ చేసి, మా వాట్సాప్ గ్రూప్‌లోనూ చేర్చుతున్నాం. స్టార్టప్‌లపై అవగాహన పెంచేందుకు ప్రతిసారీ ఒక విజేతను ఆహ్వానించి, వారి అనుభవాలను పంచుకునేలా చేస్తున్నాం" అని తెలిపారు.

Advertisement

Details

సర్వే చేశాకే పెట్టుబడి సాయం

ఈ రోజుల్లో చాలా మంది వ్యాపార ఆలోచనలతో ముందుకు వచ్చినా... సరైన నెట్‌వర్క్ లేకపోవడం, పెట్టుబడి దొరకకపోవడం, మార్కెట్ మార్పులను అర్థం చేసుకోలేక మధ్యలోనే ఆపేస్తున్నారు. మరికొందరికి స్టార్టప్ పెట్టాలనే ఆసక్తి ఉన్నా స్పష్టత ఉండదు. ఇలాంటి వారందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకే ఈ బిజినెస్ మీట్ వాక్స్ ఉపయోగపడుతున్నాయి.

Advertisement

Details

లీడర్స్ ఫర్ ఇండియా మద్దతు

లీడర్స్ ఫర్ ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నామని సంస్థ స్ట్రాటెజీ హెడ్ కిరణ్ కుమార్ ఎర్రిబోయిన తెలిపారు. మా దగ్గర ఇప్పటికే అయిదు దేశాలకు చెందిన 157 మంది సభ్యుల బృందం ఉంది. మా కమిటీలో లీడర్స్ ఫర్ ఇండియా వ్యవస్థాపకుడు మోనిష్, స్టూడెంట్ ట్రైబ్ ఫౌండర్ చరణ్ లక్కరాజు, ప్రాపర్టీబాక్స్ యజమాని రామ్ ప్రయాగ, ఎకోసిస్టమ్ వెంచర్స్ ఫౌండర్ అభిషేక్ సాంగ్వీ, సూపర్8 ఫౌండర్ సిద్ధార్థరెడ్డి ఉన్నారు. ఆస్టర్ రమేశ్ హాస్పిటల్స్, ప్రసాద్ హాస్పిటల్స్, చందన బ్రదర్స్, లాంకో గ్రూప్ సహా 150కి పైగా సంస్థలు మా సభ్యులుగా ఉన్నాయని వివరించారు.

Details

రెండు విధాల సేవలు

ఈ సంస్థ రెండు రకాలుగా సేవలు అందిస్తోంది. వారాంతాల్లో వచ్చిన ఔత్సాహికుల ఆలోచనలను పరిశీలించి, అవి సాధ్యసాధ్యాలపై చర్చించి, ఉపయోగపడే వ్యక్తులను పరిచయం చేయడం. ఉద్యోగం చేస్తూనే పెట్టుబడి ద్వారా అదనపు ఆదాయం కోరేవారికి మంచి సంస్థల్లో ఇన్వెస్ట్ చేసేలా సహకరించడం. ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్నవారికి అదనపు పెట్టుబడి మార్గాలు చూపించడం, నెట్‌వర్క్ విస్తరించడం. అలాంటి సంస్థలను మూడు దశల్లో సర్వే చేసి సంతృప్తికరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్టర్లు, మెంటార్లను పరిచయం చేయడం. అయిదేళ్ల మెంబర్‌షిప్ టార్గెట్‌తో కావాల్సిన లాభాలు అందేలా మార్గనిర్దేశం చేయడం. ఇప్పటివరకు దాదాపు రూ.65 కోట్ల పెట్టుబడిని 35కి పైగా సంస్థల్లో ఇన్వెస్ట్ చేయించినట్టు కిరణ్ కుమార్ వెల్లడించారు.

Details

ముగింపు

మొత్తానికి, మంచి వ్యాపార ఆలోచన ఉన్నా దారిదొరకని వారికి ఈ బిజినెస్ మీట్ వాక్స్ మంచి అవకాశం. కాబట్టి వారాంతాల్లో బొటానికల్ గార్డెన్ లేదా కేబీఆర్ పార్క్‌కి వెళ్లి చూడండి. మీ ఆలోచనలు పంచుకోండి. కొత్త విషయాలు తెలుసుకోండి. స్టార్టప్‌ల దిశగా తొలి అడుగు వేయండి... ఏమంటారు?

Advertisement