LOADING...
Cardamom Health Benefits : రోజూ యాలకులు తింటే ఏం జరుగుతుంది? రీరంలో జరిగే మార్పులపై నిపుణుల విశ్లేషణ!
రోజూ యాలకులు తింటే ఏం జరుగుతుంది? రీరంలో జరిగే మార్పులపై నిపుణుల విశ్లేషణ!

Cardamom Health Benefits : రోజూ యాలకులు తింటే ఏం జరుగుతుంది? రీరంలో జరిగే మార్పులపై నిపుణుల విశ్లేషణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2025
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన స్థానం దక్కించుకున్న యాలకులు వంటకాలకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. టీ, స్వీట్స్‌, కూరల్లో విరివిగా ఉపయోగించే యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే కొందరు వీటిని రోజూ నేరుగా కూడా తింటుంటారు. అలా ప్రతిరోజూ యాలకులు తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

Details

శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం

యాలకుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే ఎక్స్‌పెక్టొరెంట్ గుణాలు కఫాన్ని పలుచగా చేసి బయటకు సులభంగా వెళ్లేలా చేస్తాయి. దగ్గు, జలుబు, బ్రోంకైటిస్ వంటి సమస్యల సమయంలో ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటాయని చెబుతున్నారు. నోటి ఆరోగ్యం మెరుగుదల యాలకుల్లోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఇందులోని 'సినోల్' అనే పదార్థం నోటి దుర్వాసనకు, ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుందని National Library of Medicine పేర్కొంది. దీంతో పాటు చిగుళ్ల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని నిపుణులు వివరిస్తున్నారు.

Details

జీర్ణక్రియకు మేలు 

భోజనం అనంతరం యాలకులు తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్‌, ఉబ్బరం తగ్గడంతో పాటు అజీర్ణం, వాంతులు, కడుపునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. క్యాన్సర్ ప్రమాదం తగ్గింపు యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని National Library of Medicine చేసిన అధ్యయనంలో వెల్లడైంది. రక్తపోటు నియంత్రణ యాలకుల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించడంలో దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి మూత్రవిసర్జనను పెంచి శరీరంలోని అదనపు నీటిని తొలగించడం ద్వారా బీపీ నియంత్రణకు సహకరిస్తాయని వివరించారు.

Advertisement

Details

మంచి నిద్రకు సహాయం 

యాలకులు ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడటంతో పాటు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. షుగర్ లెవల్స్ నియంత్రణ డయాబెటిస్‌తో బాధపడేవారికి యాలకులు మంచి ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని National Library of Medicine తెలిపింది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని కూడా వివరించారు.

Advertisement

Details

 గుండె ఆరోగ్యం 

యాలకులు రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అదనంగా ఇవి ఆకలిని నియంత్రించడంలో కూడా ఉపయోగపడటంతో బరువు తగ్గాలనుకునేవారికి మేలు చేస్తాయని చెబుతున్నారు. చర్మం, జుట్టు ఆరోగ్యం యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాదు, సౌందర్యపరంగానూ లాభాలు ఉన్నాయని నిపుణులు వివరించారు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. రక్తప్రసరణను మెరుగుపరచి చర్మకణాలకు అవసరమైన ఆక్సిజన్‌, పోషకాలు అందేలా చేస్తాయి. ఇందులోని విటమిన్లు, ఫైటో న్యూట్రియంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు.

Details

ఎంత మోతాదులో తీసుకోవాలి? 

యాలకులు మంచివే అయినా అధికంగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మంచి నాణ్యత కలిగిన యాలకులను రోజుకు రెండు లేదా మూడు మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి సరైన మోతాదుగా పేర్కొంటున్నారు.

Advertisement