Loading...
Sri Krishna Janmashtami 2026: జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి?.. పండితులు చెప్పిన తేదీ ఇదే!
జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి?.. పండితులు చెప్పిన తేదీ ఇదే!

Sri Krishna Janmashtami 2026: జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి?.. పండితులు చెప్పిన తేదీ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2026
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినంగా భావిస్తారు. అధర్మాన్ని నశింపజేసి, ధర్మాన్ని స్థాపించేందుకు శ్రీమహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది భాద్రపద మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున జన్మాష్టమిని నిర్వహిస్తారు. ఈ ఏడాది శ్రీకృష్ణుడి 5253వ జయంతి సందర్భంగా జన్మాష్టమి తేదీపై ఏర్పడిన సందిగ్ధతకు పండితులు స్పష్టత ఇచ్చారు. సాధారణ గృహస్థులు సెప్టెంబరు 4న, వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే భక్తులు సెప్టెంబరు 5న జన్మాష్టమిని నిర్వహించుకోనున్నారు. ఇక దహీ-హాండీ ఉత్సవాన్ని సెప్టెంబరు 5న నిర్వహించనున్నారు.

వివరాలు

తిథి, పూజా ముహూర్తం వివరాలు

అష్టమి తిథి

సెప్టెంబరు 4న తెల్లవారుజామున 02:25 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబరు 5న అర్ధరాత్రి 12:13 గంటలకు ముగుస్తుంది.

పూజా ముహూర్తం

సెప్టెంబరు 4న రాత్రి 11:57 గంటల నుంచి, సెప్టెంబరు 5న తెల్లవారుజామున 12:43 గంటల వరకు ఉంటుంది.

రోహిణీ నక్షత్రం

సెప్టెంబరు 4న అర్ధరాత్రి 12:29 గంటలకు ప్రారంభమై.. అదే రోజు రాత్రి 11:04 గంటలకు ముగుస్తుంది.

వివరాలు

జన్మాష్టమి రోజు పూజా విధానం

జన్మాష్టమి రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు. అర్ధరాత్రి సమయంలో గోపాలుడి విగ్రహానికి పంచామృత స్నానం చేయించి.. నూతన వస్త్రాలు, కిరీటం, నెమలిపింఛం, వేణువుతో విశేషంగా అలంకరిస్తారు.

అనంతరం స్వామివారిని ఉయ్యాలలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడికి వెన్న-పటికబెల్లం (మాఖన్-మిశ్రీ), తులసీదళాలు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు.

దేశవ్యాప్తంగా ఆలయాల్లో జన్మాష్టమి సందర్భంగా రాత్రి వేళల్లో విశేష భజనలు, సంకీర్తనలు, భగవద్గీత పారాయణాలు నిర్వహిస్తారు.

భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడిని పూజించి, జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

ADVERTISEMENT