Loading...
Premium breed dogs: భారతదేశంలోని ధనవంతులు ఈ కుక్కలనే ఎందుకు పెంచుకుంటారు?
భారతదేశంలోని ధనవంతులు ఈ కుక్కలనే ఎందుకు పెంచుకుంటారు?

Premium breed dogs: భారతదేశంలోని ధనవంతులు ఈ కుక్కలనే ఎందుకు పెంచుకుంటారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

పటియాలలో ఇటీవల అద్దె ఇంటి కోసం వెళ్లిన దంపతులపై పిట్‌బుల్‌ దాడి చేయడంతో మరోసారి ఈ కుక్కల పెంపకంపై చర్చ మొదలైంది. పిట్‌బుల్‌ వంటి శక్తిమంతమైన కుక్కలను కొందరు ధనికులు లక్షల రూపాయలు వెచ్చించి పెంచుకుంటున్నారు. కుక్కను కొనుగోలు చేయడంతోనే ఖర్చు పూర్తికాదు. వాటి ఆహారం, వైద్యం, శిక్షణ, గ్రూమింగ్‌ వంటి వాటికీ గణనీయమైన మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ప్రీమియం జాతుల కుక్కలపై ఆసక్తి మాత్రం తగ్గడం లేదు.

వివరాలు 

పిట్‌బుల్‌ అనేది ప్రత్యేకమైన కుక్క జాతి కాదు

చాలామందికి పిట్‌బుల్‌ అంటే ఒక ప్రత్యేకమైన జాతి అని భావిస్తుంటారు. వాస్తవానికి ఇది ఒక నిర్దిష్ట జాతి పేరు కాదు.

అమెరికన్‌ పిట్‌బుల్‌ టెర్రియర్‌, అమెరికన్‌ స్టాఫోర్డ్‌షైర్‌ టెర్రియర్‌, అమెరికన్‌ బుల్లీ వంటి పలు శక్తిమంతమైన జాతుల కుక్కలను సాధారణంగా పిట్‌బుల్‌ అనే పదంతో సూచిస్తారు.

పెంపుడు జంతువుల విక్రయ సంస్థల సమాచారం ప్రకారం.. భారత్‌లో కొన్ని రకాల పిట్‌బుల్‌ కుక్కల ధరలు సుమారు రూ.80 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటాయి.

వాటి శరీరాకృతి, శారీరక బలం, ప్రత్యేకమైన రూపం వంటి అంశాలు కొందరిని ఆకర్షిస్తున్నాయి. అందుకే సాధారణ పెంపుడు కుక్కలతో పోలిస్తే వీటికి ప్రత్యేకమైన డిమాండ్‌ కనిపిస్తోంది.

వివరాలు 

స్టేటస్‌ సింబల్‌గా ఖరీదైన కుక్కలు

ధనిక వర్గాల్లో ఖరీదైన జాతుల కుక్కలను పెంచుకోవడం కొన్ని సందర్భాల్లో స్టేటస్‌ సింబల్‌గా కూడా మారుతోంది.

పగ్‌,గోల్డెన్‌ రిట్రీవర్‌,జర్మన్‌ షెఫర్డ్‌,డాచ్‌షండ్‌,పిట్‌బుల్‌ వంటి ప్రీమియం జాతులను కొనుగోలు చేసేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.

కుక్క ధరతో పాటు వాటి రోజువారీ ఆహారం, వైద్యం, గ్రూమింగ్‌,శిక్షణ కోసం కూడా ప్రతి నెలా వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.

అంచనాల ప్రకారం పిట్‌బుల్‌ కుక్కను పెంచేందుకు మొదటి ఏడాదిలోనే సుమారు రూ.35 వేల నుంచి రూ.83వేల వరకు ఖర్చవుతుంది.

ఆ తర్వాత వాటి నిర్వహణ కోసం నెలకు దాదాపు రూ.5,300 నుంచి రూ.11,000 వరకు ఖర్చు కావచ్చు. కుక్క ఆరోగ్యం,ఆహార అవసరాలు,శిక్షణ స్థాయి,ఇతర నిర్వహణ అంశాలను బట్టి ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

ధర, బలం మాత్రమే చూసి ఎంచుకోవద్దు

కుక్క ఖరీదైనదని లేదా శక్తిమంతమైనదని మాత్రమే పరిగణనలోకి తీసుకుని దాన్ని ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదని నిపుణులు సూచిస్తున్నారు.

పిట్‌బుల్‌ సహా ఏ జాతి కుక్క ప్రవర్తన అయినా దాని పెంపకం, శిక్షణ, సోషలైజేషన్‌, యజమాని నియంత్రణ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

అందువల్ల శక్తిమంతమైన కుక్కలను పెంచుకునే వారు వాటి ప్రవర్తనను అర్థం చేసుకుని తగిన శిక్షణ ఇవ్వడం, బాధ్యతగా నియంత్రించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రజల భద్రత కోసం ఆంక్షలు

పిట్‌బుల్‌ వంటి కుక్కల శారీరక బలం, శక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రజల భద్రతకు సంబంధించిన కొన్ని నిబంధనలు కూడా అమల్లో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా పిట్‌బుల్‌ కుక్కలపై పూర్తిస్థాయి నిషేధం లేకపోయినా.. పలు ప్రాంతాల్లో వీటి పెంపకం, బహిరంగ ప్రదేశాల్లో సంచారం వంటి అంశాలపై ఆంక్షలు విధించారు.

కాబట్టి ఇలాంటి కుక్కలను పెంచుకునే వారు స్థానికంగా అమల్లో ఉన్న నిబంధనలను తెలుసుకుని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ADVERTISEMENT