
Dinner: రాత్రి 7 గంటల లోపు భోజనం చేస్తే బోలెడన్నిఆరోగ్య ప్రయోజనాలు
ఈ వార్తాకథనం ఏంటి
శరీర ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో ఆ ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.
నేడు మారుతున్న దినచర్య, సమయపాలన లేని ఆహారపు అలవాట్ల కారణంగా, మనం తినే సమయం కూడా స్థిరంగా ఉండటం లేదు.
ముఖ్యంగా డిన్నర్ టైమింగ్ చాలా మంది పాటించరు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే రాత్రి పూట భోజనాన్ని 7గంటలలోపే కంప్లీట్ చేయాలి. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
1. కంటినిండా నిద్ర
రాత్రి త్వరగా భోజనం చేస్తే, జీర్ణం కావడానికి తగినంత సమయం దొరుకుతుంది.
రాత్రి నిద్రించడానికి 3గంటల ముందు డిన్నర్ చేస్తే జీర్ణక్రియకు తగినంత సమయం లభిస్తుంది. దీనివల్ల నిద్ర మెరగవుతుందని నిపుణులు చెబుతున్నారు.
డిన్నర్
2.మలబద్ధకం సమస్యకు పరిష్కారం
నేడు మారిన జీవనశైలి కారణంగా మలబద్ధకం తీవ్ర సమస్యగా మారుతోంది. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల మలవిసర్జనలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
అందుకే రాత్రి భోజనం త్వరగా చేస్తే.. జీర్ణం కావడానికి కావాల్సిన సమయం దొరుకుతుంది. దీంతో మలబద్ధకం సమస్య తీరుతుంది.
3.ఆరోగ్యంగా గుండె
ఆలస్యంగా డిన్నర్ చేసేవారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే త్వరగా డిన్నర్ చేస్తే.. ఆ ప్రమాంద ముప్పు తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
4. కంట్రోల్‌లో షుగర్
డిన్నర్ తొందరగా తినడం వల్ల షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. త్వరగా ఆహారం తీసుకోవడం ద్వారా, మన శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతుంది. దీని వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.