
వర్క్: సైలెంట్ గా వెళ్ళిపోవడం కంటే రచ్చ చేసి రిజైన్ చేయడమనే ట్రెండ్ గురించి తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
వర్క్ ప్లేస్ లో కొత్త కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ఇంతకుముందు జాబ్ మానేసేవాళ్ళు ఎవ్వరికీ చెప్పకుండా సైలెంట్ గా కానిచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది.
రిజైన్ చేసే ముందు అందరికీ తెలిసేలా రచ్చ చేసి వెళ్ళిపోతున్నవాళ్ళు పెరిగిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురిలో ఒకరు రచ్చ చేసి రిజైన్ చేస్తున్నారు. ఈ పరిస్థితిని లౌడ్ క్విట్టింగ్ అంటున్నారు.
లౌడ్ క్విట్టింగ్ చేసే వాళ్ళు తాము తమ జాబ్ కి రిజైన్ చేయడాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
అలాగే తమ యజమానులకు కనీసం సూచనాప్రాయంగా చెప్పకుండా డైరెక్టుగా తాము రిజైన్ చేస్తున్నట్లు చెప్పేస్తున్నారు.
ఇలా సడెన్ గా జాబ్ మానేయడానికి చాలా కారణాలున్నాయి, అవేంటో చూద్దాం.
Details
యజమానులకు ఎదురవుతున్న ఇబ్బందులు
ఒక జాబ్ పోయినా మరో జాబ్ దోరుకుతుందన్న నమ్మకం ఉద్యోగస్తుల్లో ఎక్కువగా ఉండడమే ఇలాంటి పరిస్థితికి దారి తీస్తోందట . అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి ఆఫీసులను పిలిచినపుడు తమ అసహనాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారట.
రచ్చ చేసి రిజైన్ చేయడం వల్ల కంపెనీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్క్ ఫ్లో దెబ్బతినడమే కాకుండా కంపెనీ గురించి సోషల్ మీడియాలో పంచుకోవడం వల్ల ఇబ్బందు అవుతుంది.
అంతేకాదు రిజైన్ చేస్తానని ముందే చెప్పేవాళ్ళు సీనియర్ల మాటను వినకుండా తమకు ఇచ్చిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నారట.
అయితే ప్రస్తుతం రచ్చ చేసి రిజైన్ చేయడమనే కాన్సెప్ట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.