World Animal Welfare Day 2023: ఈ భూమండలం మనుషులదే కాదు జంతువులదీనూ
భూమి మీద మనుషులతో పాటు మరెన్నో జంతుజాలం జీవిస్తున్నాయి. మనుషుల కంటే ముందు నుంచే భూమ్మీద జంతువుల మనుగడ ఉంది. మానవులు మాత్రం జంతువులను వేటాడి వాటి ఆవాసాలు, నివాసాలను లాక్కుంటున్నారు. ఇటువంటి వైపరీత్యాలను నిరోధించాలని ఏటా అక్టోబర్ 4న ప్రపంచ జంతు దినోత్సవం( World Animal Welfare Day)ని జరుపుతున్నారు. అడవుల్లోనే జీవించే యామిమల్స్, మానవ ఆవాసాల మధ్య ఉంటే మనుషులతో కయ్యానికి దిగే ప్రమాదం ఉంది. ఆహారం కోసం దాడులు చేసే మప్పు ఉంటుంది. ఇటువంటి దుస్థితిని మార్చేందుకు జంతు దినోత్సవం కృషి చేస్తుంది. ప్రపంచ జంతు దినోత్సవం ప్రాముఖ్యత : మరోవైపు జంతువుల రక్షణ,వాటి సంక్షేమాన్ని కాపాడటం ప్రధాన లక్ష్యంగా జంతు సంక్షేమ దినోత్సవంగా అక్టోబర్ 4న నిర్వహిస్తారు.
జంతువుల హక్కులను కాపాడమే లక్ష్యం
జంతు సంక్షేమ ప్రచారం, వాటి పరిరక్షక శిబిరాల ఏర్పాటు, జంతు సంరక్షణకు నిధుల సేకరణ వంటి అంశాలు చేపడుతుంటారు. మనిషి స్వార్థపోకడ వల్లే రకరకాల జంతువులు ఇప్పటికే అంతరించిపోయాయి. జంతు సంపదను పరిరక్షించి, వాటిని వృద్ధి చేయడం, హక్కులను కాపాడటమే లక్ష్యంగా జంతు సంరక్షణ ఉద్యమం సాగుతోంది. World Animal Welfare Day Theme 2023 : జంతువులు పెద్దదైనా, చిన్నదైనా మేము వాటన్నింటినీ ప్రేమిస్తాం. Animal Day History : ప్రపంచ జంతు దినోత్సవం కోసం జర్మన్ ప్రచురణ మ్యాన్ అండ్ డాగ్ రచయిత, సంపాదకుడు హెన్రిచ్ జిమ్మర్మాన్ కృషి చేశారు.
ఆ కార్యక్రమంలో 5వేల మందికిపైగా హాజరు
జర్మనీ బెర్లిన్ లోని స్పోర్ట్స్ ప్యాలెస్ లో మార్చి 24 . 1925లో ప్రపంచ జంతు దినోత్సవం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 5 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఇటలీలోని ఫ్లోరెన్స్ లో జరిగిన అంతర్జాతీయ జంతు సంరక్షణ కాంగ్రెస్‌లో, అక్టోబర్ 4ను ప్రపంచ జంతు దినోత్సవంగా గుర్తించాలన్న హెన్రిచ్ జిమ్మర్మాన్ ప్రతిపాదించగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఏటా అక్టోబర్ 4న ప్రపంచ జంతు సంరక్షణ దినోత్సనంగా జరుకోవడం ఆనవాయితీగా మారింది. ఏటా ప్రపంచ జంతు దినోత్సవంలో పాల్గొనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే భవిష్యత్ తరాల కోసం జంతువు సంరక్ష చేస్తామని వాగ్దానం చేయడం గమనార్హం.