బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, పంచుకోవాల్సిన కొటేషన్లు
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతీ ఏడాది జూన్ 12వ తేదీన జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం 2002లో ప్రారంభమైంది. బాలల హక్కులను పరిరక్షించడానికి, అమూల్యమైన బాల్యాన్ని వాళ్లకు అందించడానికి, బాలలను బడికి పంపకుండా పనికి పంపడం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కలిగించడానికి ప్రతి ఏడాది బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం జరపాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్ణయించింది. థీమ్: ప్రతీ ఒక్కరికి సామాజిక న్యాయం అందించి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి అనే థీమ్ తో ఈ సంవత్సరం సెలెబ్రేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది బాలకార్మికులు ఉన్నారు. కరోనా తర్వాత బాల కార్మికుల సంఖ్య బాగా పెరిగింది.
బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం రోజున పంచుకోవాల్సిన కొటేషన్లు
హ్యాపీగా నవ్వుతున్న పిల్లల్ని చూడడం కన్నా ఆనందకరమైన విషయం మరొకటి ఉండదు. ఆ నవ్వును చూడడం కోసం నేను నా వంతుగా ఎంతో కొంత సాయం చేస్తుంటాను. అది నా ఆటోగ్రాఫ్ ఇవ్వడమైనా సరే.. ఈ ప్రపంచంలో చిన్న పిల్లల నవ్వు కన్న విలువైనది ఏదీ లేదు - ఫుట్ బాల్ ఆటగాడు లియోనిల్ మెస్సి. బాల కార్మిక వ్యవస్థను బానిసత్వాన్ని నువ్వు చట్టబద్ధం చేయలేవు - మైఖేల్ మూరే. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ బాలుడు బడికి వెళ్లాలని బాల కార్మిక వ్యవస్థ నుండి బయటపడాలని బాలలుగా తమ హక్కులను సాధించుకోవాలని కలలు కంటూ ఉంటాను -నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి.