ప్రపంచ ఏనుగుల దినోత్సవం: ఏనుగులు మాట్లాడుకుంటాయని మీకు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ భూమి మీద నడిచే అతిపెద్ద జంతువు ఏనుగు. నీళ్ళలో ఉండే తిమింగళాలను వదిలేస్తే భూమి మీద నడిచే జంతువుల్లో అతిపెద్దది ఏనుగు.
ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ప్రతీ ఏడాది ఆగస్టు 12వ తేదీన ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుతున్నారు.
ఏనుగులను సంరక్షించడం, వాటి సంఖ్యను పెంచే ఉద్దేశ్యంతో ఈరోజును జరుపుతున్నారు. అయితే ఈరోజు ఏనుగుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ఏనుగులు రోజంతా తింటూనే ఉంటాయి:
గడ్డి, పండ్లు, ఆకులు, వేర్లు ఇలా కాలాన్ని బట్టి ఏనుగు ఎల్లప్పుడూ తింటూ ఉంటుంది. రోజులో ఎక్కువశాతం తింటూనే ఉంటుంది. దాదాపు 16గంటల పాటు తింటూనే ఉంటాయి.
Details
ఏనుగులు వైబ్రేషన్స్ ద్వారా సంభాషణ
ఏనుగులు తమలో తాము బాగా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఇవి దూరంలో ఉన్న ఏనుగులతో కూడా మాట్లాడగలవు. మనుషులు వినలేని వైబ్రేషన్స్ తో ఇవి మాట్లాడుకుంటాయి.
ఇవి చేసే వైబ్రేషన్స్ ని ఇతర ఏనుగులు వాటి శరీరం, ఎముకల ద్వారా స్వీకరిస్తాయి. దాదాపు రెండు మైళ్ళ దూరంలో ఉన్న ఇతర ఏనుగులను వినిపించేలా ఇవి వైబ్రేషన్స్ ని పంపగలవు.
ఏనుగు తొండంలో 8లీటర్ల నీరు:
ఏనుగు తొండంలో 15వేల కండర కణాలు ఉంటాయి. ఈ తొండంలో 8లీటర్ల నీరు పడుతుంది. తొండాన్ని చాలా రకాలుగా ఏనుగు ఉపయోగించుకుంటుంది.
ఈ తొండాన్ని మరొక కాలుగా ఏనుగు అప్పుడప్పుడు ఉపయోగించుకుంటుంది.