ప్రపంచ సింహాల దినోత్సవం: అడవికి రాజైన సింహం అత్యంత బద్దకంగా ఉండే జంతువని మీకు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఈరోజు వరల్డ్ లయన్ డే. అత్యంత క్రూర జంతువైన సింహాలు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్నాయి.
అందుకే సింహాల సంఖ్యను పెంచడంపై అవగాహన కల్పించడానికి ప్రతీ ఏడాది ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ఆగస్టు 10వ తేదీన జరుపుతారు.
ఈ నేపథ్యంలో సింహాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
సింహాలకు జూలు ఎందుకంటే?
మగసింహాలకు మాత్రమే జూలు ఉంటుంది. జూలు కారణంగా ఇతర జంతువులు భయపడటమే కాకుండా ఆడసింహాలు ఆకర్షితం అవుతాయి.
అంతేకాదు వేటలో జూలు ద్వారా సింహాల మెడకు రక్షణ అందుతుంది. సింహాల జూలు రంగును బట్టి సింహాల వయస్సును లెక్కిస్తారు. వయసు పెరుగుతున్న కొద్దీ జూలు రంగు మారుతూ ఉంటుంది.
Details
21 నుండి 22గంటలు నిద్రపోయే సింహాలు
సింహాలు ఒకేసారి 40కిలోల మాంసాన్ని తినగలవు:
సింహాలు వాటి బరువులో 25శాతం మాంసాన్ని ఒకేసారి తినగలవు. అంటే 40కిలోల మాంసాన్ని ఒకేసారి తినేస్తాయి. సింహాలు వాటి నాలుక ద్వారా ఎముకలకు అంటుకున్న మాంసాన్ని లాక్కుని తింటాయి.
సింహాలు బద్దకంగా ఉంటాయి:
ఒకరోజులో 21 నుండి 22గంటలు సింహాలు నిద్రపోతూనే ఉంటాయి. కేవలం 2-3గంటలు మాత్రమే వేటాడతాయి. ఇవి ఒకేసారి ఎక్కువ మాంసం తింటాయి కాబట్టి ఆహారం లేకపోయినా ఎక్కువరోజులు ఉండగలవు. సింహాల్లో ఆడసింహాలు మాత్రమే వేటలో ఎక్కువగా పాల్గొంటాయి.
మగసింహాలు బద్దకంగా ఉంటాయి.
సింహాలు అరిస్తే 8కిలోమీటర్లు వినిపిస్తుంది:
మగసింహం అరిస్తే దాదాపు 8కిలో మీటర్లు వినిపిస్తుంది. అలాగే సింహాలు ఎక్కువ దూరం వేగంగా పరుగెత్తలేవు. తక్కువ దూరాలను 80kph వేగంతో పరుగెత్తగలవు.
Details
సింహాలు రహస్యంగా పిల్లలకు జన్మనిస్తాయి
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సింహాలు తమ పిల్లలకు రహస్యంగా జన్మనిస్తాయి.
పిల్లలు పుట్టే సమయంలో ఆడసింహం ఒంటరిగా ఉంటుంది. ఒక సింహాల గుంపులో దాదాపు ఆడసింహాలన్నీ ఒకేసారి తమ పిల్లలకు జన్మనిస్తాయి.
పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆరు వారాల పాటు దాని పిల్లలను గుంపుకు తెలియకుండా దాచిపెడుతుంది. ఆ తర్వాత మిగిలిన సింహాల గుంపు దగ్గరకు పిల్లను తీసుకొస్తుంది.