NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఎందుకు జరుపుతారు? తెలుసుకోవాల్సిన విషయాలేంటి? 
    తదుపరి వార్తా కథనం
    ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఎందుకు జరుపుతారు? తెలుసుకోవాల్సిన విషయాలేంటి? 
    ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం

    ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఎందుకు జరుపుతారు? తెలుసుకోవాల్సిన విషయాలేంటి? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 08, 2023
    10:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతీ ఏడాది జూన్ 8వ తేదీన ప్రపంచ మహాసముద్రాలు దినోత్సవాన్ని జరుపుతారు. సముద్రాల ప్రాముఖ్యతను జనాలకు తెలియజేయడానికి, సముద్ర వనరులను సంరక్షించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతారు.

    మానవ మనుగడకు మహాసముద్రాలు ఎంతో మేలు చేస్తాయి, మనకు ఆహారం అందించడం నుండి భూమి మీద జీవవైవిద్యాన్ని కాపాడే వరకు సముద్రాల ప్రాముఖ్యత ఎంతో ఉంది.

    అయితే మనిషి చేసే అరాచక పనుల వల్ల సముద్రాలు దెబ్బతింటున్నాయి. కాలుష్య కారకాలను సముద్రంలోకి వదలడం, సముద్ర జీవులను విచ్చలవిడిగా వేటాడటం మొదలైనవన్నీ సముద్రాలను దెబ్బతీస్తున్నాయి.

    ఇలాంటి పనులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఈ రోజున అనేక అవగాహన కార్యక్రమాలు జరుపుతారు. ప్లాస్టిక్ వస్తువుల వల్ల సముద్ర జీవాలకు ఎదురయ్యే ఇబ్బందిని తెలియజేసే అనేక కార్యక్రమాలు జరుపుతారు.

    Details

    చరిత్ర, కొటేషన్లు 

    ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం జరుపుకోవాలని 1992లో కెనడా ప్రభుత్వం సూచించింది. ఈ ప్రతిపాదన అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటంతో ప్రతీ ఏడాది జూన్ 8వ తేదీన ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.

    ఈ దినోత్సవానికి ప్రతీ ఏడాది ఒక ప్రత్యేక థీమ్ ఉంటుంది ఈసారి, సముద్రంలో ఆటుపోట్లు మారుతున్నాయి అనే థీమ్ తో సెలబ్రేట్ చేస్తున్నారు.

    వరల్డ్ ఓషియన్ డే కొటేషన్లు

    ఈ భూమ్మీద నువ్వు ఎక్కడ నివసించినా, చుక్క నీరు తాగుతున్నావంటే, గుప్పెడు శ్వాస పీలుస్తున్నావంటే నీకు సముద్రంతో సంబంధం ఉన్నట్టే లెక్క - సిల్వియా ఎర్లీ.

    ఈ సముద్రం హృదయాన్ని కదిలిస్తుంది, ఊహకు స్ఫూర్తినిస్తుంది, అంతులేని ఆనందాన్ని ఇస్తుంది - రాబర్ట్ వైలాండ్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముఖ్యమైన తేదీలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ముఖ్యమైన తేదీలు

    జాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ లైఫ్-స్టైల్
    వరల్డ్ హిప్పో డే: నీటిలో ఈదగలిగి, నీటిమీద తేలలేని ఈ జీవుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు లైఫ్-స్టైల్
    పిత్త వాహిక క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, రావడానికి కారణాలు, ట్రీట్మెంట్ లైఫ్-స్టైల్
    అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం 2023: పిల్లలకు మాతృభాషలో విద్య ఎందుకు అందించాలో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025