
వరల్డ్ ఫిజియోథెరపీ డే 2023: ఫిజియోథెరపీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన వరల్డ్ ఫిజియోథెరపీ డే ని జరుపుకుంటారు. ఫిజియోథెరపీ ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు ఈ రోజును జరుపుతారు.
ఇంకా ఫిజియోథెరపీ ద్వారా ఆరోగ్యాన్ని అందించే ఫిజియోథెరపిస్టుల సేవలను గుర్తించడానికి ఈ రోజును జరుపుతారు.
ఫిజియోథెరపీ అనేది వైద్యం. దీనివల్ల శరీరంలో ఆగిపోయిన కదలికలు మళ్లీ ఉత్తేజం పొందుతాయి.
గాయాల వల్ల శరీరంలోని కండరాల కదలికలు ఆగిపోతే ఆ కండరాల్లో చలనం అందించి తమ పనిని నిర్వర్తించేలా ఫిజియోథెరపీ చేస్తుంది.
కండరాలను బలోపేతం చేయడం, ఆరోగ్యాన్ని అందించడం ఫిజియోథెరపీ ముఖ్య లక్ష్యం.
వరల్డ్ ఫిజియోథెరపీ డే ని మొదటిసారిగా 1996లో జరుపుకున్నారు.
Details
ఫిజియోథెరపీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఫిజియోథెరపీ బయటపడేస్తుంది. కండరాల నొప్పులు, కండరాల్లో కదలికలు లేకపోవడం, ఆర్థరైటిస్ సమస్యలు, వెన్నుపూస సమస్యలు మొదలగు వాటిని నయం చేస్తుంది.
ఏదైనా ప్రమాదంలో గాయాలైనప్పుడు వాటినుండి రికవరీ చేయడంలో ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది.
పక్షవాతం వంటి సమస్యల నుండి రికవరీ చేయడంలో ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది.
శరీరం బాలన్స్ కోల్పోకుండా నిటారుగా నిలబడడానికి కావలసిన సాయం చేస్తుంది.
వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ఇబ్బందులను దూరం చేయడంలో ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది.
కొన్ని కొన్ని సార్లు ఏవైనా సమస్యలకు సర్జరీ అవసరం లేకుండా ఫిజియోథెరపీ నయం చేస్తుంది.