ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ సంవత్సరం జులై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతున్నారు. జనాభా పెరుగుదలలో వస్తున్న మార్పులు మొదలగు విషయాలపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఈరోజు జరుపుతున్నారు.
జనాభా పెరిగితే ఏర్పడే సవాళ్ళు , ఎదుర్కునే ఇబ్బందులు, అలాగే ఒకవేళ జనాభా తగ్గితే వచ్చే సమస్యలు, వాటిపై అవగాహన అందరికీ కలగజేయాలన్న ఉద్దేశ్యంతో ఈరోజును జరుపుతున్నారు.
చరిత్ర:
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 1989 నుండి జరుపుకుంటున్నారు. 1987 జులై 11నాటికి ప్రపంచ జనాభా 5బిలియన్లకు చేరుకున్నందున ఈరోజును జరపాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయింది.
ఈ రోజును జరుపుకోవాలని డాక్టర్ కేసీ జకారియా ప్రతిపాదించారు.
Details
ఈ ఏడాది థీమ్ ఏంటంటే?
కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, మానవ హక్కులు, ప్రసూతి ఆరోగ్యం మొదలగు విషయాలపై చర్చించడానికి, అందరికీ తెలియజేయడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
ప్రతీ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవానికి ఏదో ఒక థీమ్ ఉంటుంది. ఈ ఏడాది, లింగ సమానత్వం శక్తిని వెలికితీసి మహిళలకు, బాలికలకు తమ మాట వినిపించే విధమైన అవకాశాలు కల్పించడం అనే థీమ్ ని ఎంచుకున్నారు.
ఈరోజున ప్రభుత్వ ఆఫీసుల్లో జనాభా సంబంధిత అంశాలపై చర్చించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జనాభా వల్ల వచ్చే పేదరికం, పర్యావరణ సమస్యలు, ఆర్థిక అసమానతలు, ఆరోగ్యం, మొదలగు విషయాలపై అభిప్రాయాలు పంచుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు.