వరల్డ్ రేబిస్ డే 2023: చరిత్ర, థీమ్, తెలుసుకోవాల్సిన విషయాలు
ప్రతీ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన వరల్డ్ రేబిస్ డే ని జరుపుకుంటారు. ప్రపంవ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం రేబిస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో రేబిస్ వ్యాధిపై అవగాహన కల్పించడానికి, రేబిస్ వ్యాధిని నిరోధించడానికి ప్రతీ ఏడాది రేబిస్ డే ని జరుపుకోవాలని గ్లోబల్ అలియన్స్ ఫర్ రేబిస్ కంట్రోల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి నిర్ణయించాయి. రేబిస్ సోకిన వారికి వైద్యం జరక్కపోతే వారి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సాధారణంగా రేబిస్ వైరస్ అనేది జంతువుల ఉమ్మి ద్వారా మనుషులకు సోకుతుంది. రేబిస్ వ్యాధి సోకినవారిలో, తలనొప్పి, అధిక జ్వరం, ఉమ్మి ఎక్కువగా రావడం, పక్షవాతం, మానసిక సమస్యలు లక్షణాలుగా ఉంటాయి
వరల్డ్ రేబిస్ డే 2023 థీమ్
రేబిస్ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టిన లూయిస్ పాశ్చర్ జ్ఞాపకార్థం సెప్టెంబర్ 28వ తేదీన రేబిస్ డే ని జరుపుతున్నారు. 1895 సెప్టెంబర్ 28వ తేదీన లూయిస్ పాశ్చర్ మరణించారు. ప్రతీ ఏడాది వరల్డ్ రేబిస్ డే రోజున ఏదో ఒక థీమ్ ఉంటుంది. ఈసారి అందరికీ ఆరోగ్యం (All for 1, One Health for Al) అనే థీమ్ ని నిర్ణయించారు. 2030సంవత్సరం వరకల్లా రేబిస్ వ్యాధితో చనిపోయే వారి సంఖ్య సున్నాకు చేరుకోవాలని అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్ అలియాన్స్ ఫర్ రేబిస్ కంట్రోల్ పనిచేస్తున్నాయి. వరల్డ్ రేబిస్ డే రోజున ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి.