Page Loader
ప్రపంచ శరణార్థుల దినోత్సవం: ప్రాణ భయంతో వేరే దేశాలకు పారిపోయే శరణార్థుల కోసం ప్రత్యేకమైన రోజు ఎందుకో తెలుసా? 
ప్రపంచ శరణార్థుల దినోత్సవం

ప్రపంచ శరణార్థుల దినోత్సవం: ప్రాణ భయంతో వేరే దేశాలకు పారిపోయే శరణార్థుల కోసం ప్రత్యేకమైన రోజు ఎందుకో తెలుసా? 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 20, 2023
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతీ ఏడాది జూన్ 20వ తేదీన ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుతారు. తమ దేశంలో సరైన రక్షణ లేకపోవడం, ఉగ్రవాద చర్యల వల్ల ప్రాణభయం, హింస, భీభత్సం మొదలైన కారణాల వల్ల సామాన్య ప్రజలు ఇతర దేశాలకు బ్రతకడానికి వెళ్తుంటారు. అలాంటి వారిని శరణార్థులు అంటారు. అలాంటి వారి జీవితాల గురించి అందరికీ అవగాహన కలిగించడానికి, వారిపట్ల సానుభూతి కలిగించి బ్రతకడానికి సరైన ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వాలను ప్రోత్సహించేందుకు శరణార్థుల దినోత్సవాన్ని జరుపుతున్నారు. అమెరికాలో మొట్టమొదటి సారిగా శరణార్థుల దినోత్సవాన్ని 2000సంవత్సరంలో జరుపుకున్నారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా 2001నుండి జరుపుకోవడం మొదలైంది. శరణార్థుల దినోత్సవం రోజున వారి హక్కులు, అవసరాలను హైలేట్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకు సంరక్షణ కల్పించాలని చూస్తుంటారు.

Details

శరణార్థుల కోసం ప్రత్యేక హక్కులు 

భద్రత లేకపోవడం, ప్రాణాలకు ముప్పు ఉండడం, ఉగ్రవాదం, హింస మొదలైన కారణాల వల్ల ప్రతీ నిమిషానికి 20మంది వ్యక్తులు తమ దేశం విడిచి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. 1951ఒప్పందం, 1967ప్రోటోకాలు ఒప్పందాలు శరణార్థులకు రక్షణ కల్పించడంలో సాయం చేస్తాయి. 1951ఒప్పందం ప్రకారం, శరణార్థులు ఎవరైనా ఇతర దేశాల నుండి వచ్చిన అతిథులతో సమానమని తెలియజేస్తుంది. వారిపట్ల వివక్ష చూపరాదని చెబుతోంది. అలాగే 1967ప్రోటోకాల్ ప్రకారం, తమ జీవితాలకు ప్రాణహాని ఉన్న శరణార్థులు తమ దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. శరణార్థుల వల్ల ఆతిథ్య దేశానికి ఏదైనా హాని ఉంటే తప్ప తమ సొంత దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు.