400 మీటర్ల లోతులో హోటల్ గదులు: ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న హోటల్ గురించి తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఆతిథ్య రంగంలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు, కాన్సెప్టులు వస్తున్నాయి. అతిథులకు ఆసక్తిని కలిగించడానికి రకరకాల ఆలోచనలతో హోటళ్లను నిర్మిస్తున్నారు.
యునైటెడ్ కింగ్ డమ్ లో ఇటీవల ప్రారంభమైన అత్యంత లోతులో ఉన్న ఈ హోటల్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
నార్త్ వేల్స్ లోని స్నోడోనియా పర్వతాల కింద విక్టోరియా గనుల్లో 400మీటర్ల లోతులో ఈ హోటల్ ని నిర్మించారు. 419మీటర్ల లోతులో 4డబుల్ బెడ్ రూమ్ క్యాబిన్లను ఈ హోటల్లో నిర్మించారు.
శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు మాత్రమే ఈ హోటల్లో బస చేసే అవకాశం ఉంది. ఈ హోటల్ కి వెళ్లాలంటే 45 నిమిషాల ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
Details
హోటల్ వరకూ తీసుకెళ్ళే గైడ్
లోతులోకి వెళ్లడానికి మీకు అవసరమైన తాడు, షూస్, హెల్మెట్ టార్చ్ లైట్ అందిస్తారు. మీరు ఒంటరిగా ఈ హోటల్ కి వెళ్ళలేరు, మీతో పాటు ఒక గైడ్ ఉంటాడు.
హోటల్ కి చేరుకోగానే రిలాక్స్ కావడానికి డ్రింక్ ఇస్తారు. ఆ తర్వాత, భోజనం ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా అందుబాటులో ఉంటుంది. మళ్లీ ప్రొద్దున్న ఎనిమిదింటికి లేచి ఒక డ్రింక్ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి చెక్ అవుట్ చేయాల్సి ఉంటుంది.
రూమ్ ధరలు
ప్రైవేట్ రూమ్ తీసుకుంటే ఒక రాత్రికి 36,000రూపాయల ఖరీదు ఉంటుంది. కపుల్స్ కోసం కేటాయించిన ప్రత్యేకమైన గదికి 57వేల రూపాయలు ఒక రాత్రికి ఛార్జ్ చేస్తారు.