
వరల్డ్ సికిల్ సెల్ ఎనీమియా అవేర్నెస్ డే: ఈ వ్యాధి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
సికిల్ సెల్ ఎనీమియా పట్ల అవగాహన కలిగించడానికి ప్రతీ ఏడాది జూన్ 19వ తేదీన ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా అవగాహన దినోత్సవాన్ని జరుపుతారు.
సికిల్ సెల్ ఎనీమియా అంటే:
రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలు సాధారణంగా గుండ్రంగా ఉంటాయి. అయితే సికిల్ సెలె ఎనీమియా వచ్చిన వారిలో గుండ్రంగా ఉండే ఎర్ర రక్తకణాలు కొడవలి ఆకారంలోకి మారిపోతాయి. దీనివల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి శరీరంలో అనేక ఇబ్బందులు కలుగుతాయి.
ఎర్ర రక్త కణాల్లో ఉండే హీమోగ్లోబిన్, శరీర అవయవాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. కొడవలి ఆకారంలోకి రక్తకనాలు మారితే శరీర అవయవాలకు ఆక్సిజన్ అందడం కష్టంగా మారుతుంది.
Details
సికిల్ సెల్ ఎనీమియా లక్షణాలు, చికిత్స
లక్షణాలు:
ఈ పరిస్థితి ఉన్నవారు తొందరగా అలసిపోతారు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి, చిన్నపిల్లల్లో పెరుగుదల సమస్య ఉంటుంది. రక్తహీనత, పచ్చకామెర్లు, చూపు తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
చికిత్స:
దీనికి ఖచ్చితమైన చికిత్స లేదు. కాకపోతే దీనివల్ల వచ్చే ఇతర ఇబ్బందులను తగ్గించడానికి మందులు ఉన్నాయి. రక్తమార్పిడి చేసుకుంటూ ఉంటే సికిల్ సెల్ ఎనీమియా వల్ల వచ్చే నష్టాలు తగ్గుతాయి.
ఎర్ర రక్తకణాలు తయారయ్యే ఎముక మజ్జ(బోన్ మారో)ను మార్చడం వల్ల కూడా ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. కాకపోతే ఇది చాలా కష్టమైన పని. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఈ పద్దతిని అవలంబిస్తారట.