
ప్రపంచ వెన్నెముక దినోత్సవం: చరిత్ర, థీమ్, తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది అక్టోబర్ 16వ తేదీన ప్రపంచ వెన్నెముక దినోత్సవాన్ని జరుపుతారు. వెన్నెముక ఆరోగ్యంపై అవగాహన కలిగించడానికి ఈరోజును జరుపుతారు.
శరీర స్థితి సరిగ్గా ఉండడానికి, శరీర కదలికలు బాగుండాలంటే వెన్నెముక ఆరోగ్యంగా ఉండాలి.
చరిత్ర:
మొదటిసారిగా ప్రపంచ వెన్నెముక దినోత్సవాన్ని 2008సంవత్సరంలో జరుపుకున్నారు. శరీర ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి వెన్నెముక ఆరోగ్యం ముఖ్యమని, ప్రతీ ఏడాది వెన్నెముక దినోత్సవాన్ని జరుపుకోవాలని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ కైరోప్రాక్టిక్ నిర్ణయించింది.
వెన్నెముక దినోత్సవం రోజున వెన్నెముకకు వచ్చే సమస్యలను తెలియజేస్తారు. అలాగే ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలనే విషయాలను చర్చిస్తారు.
Details
ప్రపంచ వెన్నెముక దినోత్సవం 2023 థీమ్
ప్రతీ ఏడాది ఏదో ఒక థీమ్ ఉంటుంది. ఈ ఏడాది మీ వెన్నెముకను కదిలించడండి అనే థీమ్ ని ఎంచుకున్నారు.
దీని ప్రకారం, వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుకోవాలని, అందుకు సంబంధించిన వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు.
వెన్నెముక ఆరోగ్యానికి పనికొచ్చే ఆసనాలు:
భుజంగాసనం:
ఈ ఆసనం వల్ల వెన్నెముక బలంగా మారుతుంది. ముఖ్యంగా వెన్నెముక కింది భాగం, మధ్య భాగానికి మంచి బలం చేకూరుతుంది.
బాలాసనం:
ఈ ఆసనం వల్ల వెన్నెముక సాగదీయబడుతుంది. దానివల్ల వెన్నెముక రిలాక్స్ అవుతుంది.
సేతుబంధ సర్వాంగసనం:
ఆసనం వల్ల కాళ్ళు, మెడ భాగాలకు బలం చేకూరుతుంది. ఇంకా వెన్నెముకను బలంగా మారుస్తుంది.