Page Loader
World Wide Web Day 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, జరుపుకోవాల్సిన విధానాలు 
వరల్డ్ వైడ్ వెబ్ డే గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

World Wide Web Day 2023: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, జరుపుకోవాల్సిన విధానాలు 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 01, 2023
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతీ ఏడాది ఆగస్టు 1వ తేదీన వరల్డ్ వైడ్ వెబ్ డేని జరుపుకుంటారు. వరల్డ్ వైడ్ వెబ్ ని టిమ్ బెర్నర్స్ లీ సృష్టించారు. 1991 ఆగస్టు 1వ తేదీన వరల్డ్ వైడ్ వెబ్ ప్రతిపాదన గురించి టిమ్ బెర్నర్స్ లీ alt.hypertext newsgroup మాట్లాడారు. నిజానికి CERN (European Organisation for Nuclear Research)లో పనిచేస్తున్న టిమ్ బెర్నర్స్ లీ 1989లో వరల్డ్ వైడ్ వెబ్ ని సృష్టించాడు. 1989 మార్చ్ లో CERN ఉద్యోగులతో సమాచారాన్ని పంచుకునేందుకు ఒక సిస్టమ్ ను క్రియేట్ చేసారు. మొట్టమొదటి వెబ్ సర్వర్ https, మొట్ట మొదటి WorldWideWeb ని 1990లో తన స్నేహితుడు రాబర్ట్ కలిసి టిమ్ తయారు చేసారు.

Details

ఆగస్టు 6న మొదటి వెబ్ సైట్ 

1991 ఆగస్టు 6వ తేదీన ప్రపంచంలోనే మొట్టమొదటి వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సైట్ లో వరల్డ్ వైడ్ వెబ్ విశేషాలు, దాన్నెలా ఉపయోగించాలో తెలియజేసే సమాచారం ఉంది. అప్పుడు మొదలైన వరల్డ్ వైడ్ వెబ్ లో ఎన్నో మార్పులు వచ్చేసాయి. ప్రస్తుతం వరల్డ్ వైడ్ వెబ్ డే ని ఎలా జరుపుకోవాలంటే? వెబ్ చరిత్ర తెలుసుకోవడం, దానిలో జరిగిన మార్పులను తెలుసుకోవడం, అలాగే ప్రస్తుతం వెబ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. మీరు ఎక్కువగా వాడే వెబ్ సైట్స్ ని ఇతరులతో పంచుకోండి. మీ స్నేహితులు, ఫ్రెండ్స్ తో వెబ్ సైట్ వివరాలు షేర్ చేయండి.

Details

కోడింగ్ నేర్చుకోండి 

ఇంటర్నెట్ పెరిగిపోతున్న ఈ తరుణంలో కోడింగ్ అనేది అందరూ నేర్చుకోవాల్సిన అంశంగా మారిపోయింది. మీరు కూడా సింపుల్ కోడింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటివరకు మీరు చూడని మీకు ఉపయోగపడే వెబ్ సైట్స్ చాలానే ఉండి ఉంటాయి. వాటిని ఒకసారి చూడండి. అలాగే మీకు పనికొచ్చే కొత్త యాప్స్ గురించి తెలుసుకోండి.